Telugu Global
International

కరోనా కర్ఫ్యూని పాటించని సాకర్ స్టార్ అరెస్టు

సెర్బియా స్టార్ కు 28 రోజుల క్వారెంటెయిన్ శిక్ష ప్రపంచ వ్యాప్తంగా 200 దేశాలలో ఓ వైపు కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తుంటే… మరోవైపు… అతిపెద్ద జనాభా కలిగిన భారత్ దేశం 21 రోజుల లాక్ డౌన్ ను పాటిస్తుంది. మరోవైపు జనం పిట్టల్లా రాలిపోతున్న యూరోప్ దేశాలు మాత్రం నియమిత సమయాలలో కర్ఫ్యూని అమలు చేస్తూ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి నానాపాట్లు పడుతున్నాయి. బాల్కన్ దేశం సెర్బియాలో 1476 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా…39 మరణాలు […]

కరోనా కర్ఫ్యూని పాటించని సాకర్ స్టార్ అరెస్టు
X
  • సెర్బియా స్టార్ కు 28 రోజుల క్వారెంటెయిన్ శిక్ష

ప్రపంచ వ్యాప్తంగా 200 దేశాలలో ఓ వైపు కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తుంటే… మరోవైపు… అతిపెద్ద జనాభా కలిగిన భారత్ దేశం 21 రోజుల లాక్ డౌన్ ను పాటిస్తుంది.

మరోవైపు జనం పిట్టల్లా రాలిపోతున్న యూరోప్ దేశాలు మాత్రం నియమిత సమయాలలో కర్ఫ్యూని అమలు చేస్తూ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి నానాపాట్లు పడుతున్నాయి.

బాల్కన్ దేశం సెర్బియాలో 1476 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా…39 మరణాలు నమోదయ్యాయి. దీంతో అక్కడి ప్రభుత్వం…కరోనా వైరస్ నియంత్రణ
కోసం సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూని కఠినంగా అమలు చేస్తోంది.

ప్రజలు పిక్నిక్ లకు, భారీ సమావేశాలు, విందులు, వేడుకలకు దూరంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే…సెర్బియా సాకర్ జాతీయ జట్టులో సభ్యుడు, స్ట్రయికర్ అలెగ్జాండర్ రిజోవిచ్ బెల్ గ్రేడ్ లోని ఓ రెస్టారెంట్ లాంజ్ లో మరో ఐదుగురితో కలసి..కర్ప్యూ సమయంలో మద్యపానం చేస్తూ దొరికిపోయాడు.

దీంతో పోలీసులు వచ్చి నిషేధాజ్ఞలు ఉల్లంఘిచిన రిజోవిచ్ తోపాటు మిగిలిన ఐదుగురుని అరెస్టు చేయడంతో పాటు… రెస్టారెంట్ యాజమాన్యంపైనా కేసు బుక్ చేశారు.

కర్ఫ్యూని అతిక్రమించిన వారికి…సెర్బియా ప్రభుత్వ నిబందనల ప్రకారం 28 రోజుల స్వీయ గృహనిర్భంధం శిక్ష విధిస్తున్నారు.

ప్రభుత్వనిబంధనలను తూచతప్పక పాటిస్తూ.. దేశంలోని ప్రజలందరికీ ఆదర్శంగా నిలవాల్సిన సాకర్ స్టార్ రిజోవిచ్ పోలీసులకు దొరికిపోవడం, న్యాయస్థానం బోనులో నిలవడం… అదీ చాలదన్నట్లుగా 28 రోజుల సెల్ఫ్ క్వారెంటెయిన్ శిక్షకు గురికావడం…కరోనా వైరస్ మహిమ కాకపోతే మరేమిటి.

First Published:  5 April 2020 6:24 AM IST
Next Story