'లక్ష మృతదేహాల బ్యాగులను సిద్దం చేస్తున్న అమెరికా'
ఒక్కోసారి అతి విశ్వాసం, తమకేం కాదలే అన్న గర్వం ఎంత నష్టాలపాలు చేస్తుందో అగ్రరాజ్యం అమెరికా తెలుసుకుంటోంది. వుహాన్ నగరంలో పుట్టిన కరోనా మహమ్మారి ఆ తర్వాత యూరోప్‌లోని ఇటలీ, స్పెయిన్‌లను అతలాకుతలం చేస్తున్నా.. మాకేం కాదనే మేకపోతు గాంభీర్వం ప్రదర్శించాడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పదే పదే ‘చైనా వైరస్’ అంటూ ఎద్దేవా చేస్తూ.. ప్రజల ప్రాణాలను గాల్లో దీపంలా మార్చేశాడు. కానీ అసలు విషయం బోధపడేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వైరస్ పుట్టిన చైనాలో […]
ఒక్కోసారి అతి విశ్వాసం, తమకేం కాదలే అన్న గర్వం ఎంత నష్టాలపాలు చేస్తుందో అగ్రరాజ్యం అమెరికా తెలుసుకుంటోంది. వుహాన్ నగరంలో పుట్టిన కరోనా మహమ్మారి ఆ తర్వాత యూరోప్‌లోని ఇటలీ, స్పెయిన్‌లను అతలాకుతలం చేస్తున్నా.. మాకేం కాదనే మేకపోతు గాంభీర్వం ప్రదర్శించాడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పదే పదే ‘చైనా వైరస్’ అంటూ ఎద్దేవా చేస్తూ.. ప్రజల ప్రాణాలను గాల్లో దీపంలా మార్చేశాడు. కానీ అసలు విషయం బోధపడేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
వైరస్ పుట్టిన చైనాలో కంటే అత్యధిక కరోనా పాజిటీవ్ కేసులు ప్రస్తుతం అమెరికాలోనే నమోదయ్యాయి. తాజా లెక్కల ప్రకారం 2 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా 6 వేల మందికి పైగా మృతి చెందారు. గురువారం ఒక్కరోజే 1100 మంది ప్రాణాలు కోల్పోవడం విచారించాల్సిన విషయం. వైట్‌హౌస్ విశ్లేషకులు క్షేత్రస్థాయి నుంచి వచ్చిన డేటాను విశ్లేషించి… అమెరికాలో రెండున్నర లక్షల మంది కంటే ఎక్కువ మందే మృత్యువాత పడతారని అంచనా వేసింది.
కాగా, తాజా అంచనాలతో అప్రమత్తమైన ట్రంప్ ప్రభుత్వం అత్యవసరంగా 1 లక్ష మృతదేహాల బ్యాగులను సిద్దం చేయడానికి ప్రయత్నిస్తోంది. తమకు వెంటనే 1 లక్ష బ్యాగులు సరఫరా చేయాలని ‘ఫెమా’ అమెరికా సైన్యాన్ని కోరింది. కాగా, అమెరికా కరోనా వైరస్‌కు కేంద్రంగా ఉన్న న్యూయార్క్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రజలెవ్వరూ బయటకు రావొద్దని నగర మేయర్ బిల్ డి బ్లేసియో అభ్యర్థించారు. అక్కడ లాక్‌డౌన్ అమలు చేయడానికి సైన్యం రంగంలోనికి దిగింది.