తప్పుడు ప్రచారాలు వద్దు... వినకుంటే కఠిన చర్యలే!
కరోనా ప్రభావం పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఆనందిస్తున్నారు. అది తప్పని తెలిసినా.. ఏ మాత్రం ఆలోచించడం లేదు. ఫలితంగా.. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఆ తప్పుడు ప్రచారాలు నిజమే అనుకుని ఆందోళనకు గురవుతున్నారు. లేని దానికి ఏదో ఉందనుకుని తెగ టెన్షన్ పడుతున్నారు. ఇలాంటి వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఇకపై.. తప్పుడు ప్రచారాలు ఎవరైనా చేస్తే సహించేది లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పరిధిలో […]
కరోనా ప్రభావం పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఆనందిస్తున్నారు. అది తప్పని తెలిసినా.. ఏ మాత్రం ఆలోచించడం లేదు. ఫలితంగా.. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఆ తప్పుడు ప్రచారాలు నిజమే అనుకుని ఆందోళనకు గురవుతున్నారు. లేని దానికి ఏదో ఉందనుకుని తెగ టెన్షన్ పడుతున్నారు. ఇలాంటి వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు.
ఇకపై.. తప్పుడు ప్రచారాలు ఎవరైనా చేస్తే సహించేది లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పరిధిలో ఉన్న గరికపాడు పోలీస్ చెక్ పోస్టును ఆయన పరిశీలించారు. లాక్ డౌన్ అమలు అవుతున్న తీరును తెలుసుకున్నారు. కరోనా బాధితుల విషయంలో పోలీసులు చాలా కష్టపడుతున్నారని చెప్పారు. ప్రజలు కూడా మంచి స్ఫూర్తిని ప్రదర్శిస్తూ సహకరిస్తున్నారని ప్రశంసించారు. కానీ.. కొందరు మాత్రం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు.
తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితే వస్తే.. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. విషయాన్ని ఓ సందర్భంలో ప్రస్తావించారు. శిక్షలు అంటే ఎలా ఉంటాయన్నదీ.. అమలు చేసి చూపిస్తామని కఠినంగా హెచ్చరించారు. ఇప్పుడు.. ఏపీలోనూ తప్పుడు ప్రచారాల తీరుపై డీజీపీ స్థాయిలో హెచ్చరికలు జారీ అయ్యాయి.
కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు, కంటైన్ మెంట్ జోన్లు, రెడ్ జోన్లు, మత పరమైన విషయాలు, క్వారంటైన్ కేంద్రాలు… ఇలా ప్రస్తుత వ్యవహారానికి సంబంధించిన ఏ విషయంపై అయినా.. ఇకపై అనధికార ప్రచారాలు చేస్తే.. అనూహ్య చర్యలు తప్పవన్న సంకేతాలు.. డీజీపీ మాటల్లో ధ్వనించాయి.
ఇప్పటికైనా.. ప్రజలు బాధ్యతగా ఉండాలి. సామాజిక మాధ్యమాల్లో లేనిపోని విషయాలు షేర్ చేయకుండా జాగ్రత్తపడాలి. లేదంటే.. ఎవరో చేసిన పనికి.. ఇంకెవరో శిక్ష పడాల్సిన పరిస్థితిని ఈ అత్యుత్సాహం కల్పిస్తుందన్న వాస్తవాన్ని గ్రహించాలి.