Telugu Global
NEWS

రానున్న రోజుల్లో 10లక్షల కరోనా కేసులు... డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక...

కరోనా.. కరోనా.. కరోనా.. ఇప్పుడెక్కడ చూసినా కరోనా పేరే మారుమ్రోగిపోతుంది. చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా వైరస్ క్రమంగా ప్రపచంలోని అన్నిదేశాలకు పాకింది. ఇప్పటికే ప్రపంచంలోని 200లకు పైగా దేశాల్లో కరోనా సోకింది. దీంతో ఆయా దేశాలు కరోనా కట్టడికి లాక్ డౌన్ వంటి చర్యలను చేపడుతున్నాయి. అయినప్పటికీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. కరోనా మహమ్మరి విజృంభిస్తుండటంతో ఇప్పటికే 8లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య మరింత […]

రానున్న రోజుల్లో 10లక్షల కరోనా కేసులు... డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక...
X

కరోనా.. కరోనా.. కరోనా.. ఇప్పుడెక్కడ చూసినా కరోనా పేరే మారుమ్రోగిపోతుంది. చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా వైరస్ క్రమంగా ప్రపచంలోని అన్నిదేశాలకు పాకింది. ఇప్పటికే ప్రపంచంలోని 200లకు పైగా దేశాల్లో కరోనా సోకింది. దీంతో ఆయా దేశాలు కరోనా కట్టడికి లాక్ డౌన్ వంటి చర్యలను చేపడుతున్నాయి. అయినప్పటికీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి.

కరోనా మహమ్మరి విజృంభిస్తుండటంతో ఇప్పటికే 8లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తుంది. రానున్న రోజుల్లో 10లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ డీజీ హెచ్చరిస్తుంది. గత ఐదువారాలుగా కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపు అవుతున్నాయని అలాగే మరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇదిలా ఉంటే భారత్ లోనూ రోజుకు వందల సంఖ్యలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు గత రెండ్రోరోజులుగా భారీగా బయటపడుతున్నాయి. తెలంగాణలో బుధవారం ఒక్కరోజే 30పాజిటివ్ కేసులు నమోదుగా ముగ్గురు మృతిచెందారు. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 127కు చేరుకోగా తొమ్మిది మంది మృతిచెందారు.

దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులకు ఢిల్లీ మర్కజ్ కు లింకు ఉండటంతో కేంద్రం అలర్ట్ అయింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం అందించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారి వివరాలను సేకరించి… వారికి కరోనా టెస్టులను నిర్వహించి ఐసోలేషన్ కు తరలిస్తున్నారు.

First Published:  2 April 2020 9:05 AM IST
Next Story