Telugu Global
National

ఈ 2 వారాలు.... అత్యంత కీలకం.... జాగ్రత్త అత్యవసరం

కరోనా మహమ్మారి రోజు రోజుకూ విస్తరణ పెంచుకుంటూ పోతున్న భయంకర పరిస్థితుల్లో… ఈ రెండు వారాలు అత్యంత కీలకం కానున్నాయి. ప్రభావం తక్కువగానే ఉందనుకున్న తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విలయతాండవం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో.. ప్రజలు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన తరుణం వచ్చింది. నిజాముద్దీన్ వెళ్లి వచ్చిన వారి ప్రభావంతో కేసులు పెరుగుతున్నాయని భావిస్తున్న అధికారులు.. రానున్న రెండు వారాల్లో కేసుల సంఖ్య భారీగా పెరగవచ్చని భావిస్తున్నారు. అందుకే.. ఆరోగ్యంగా ఉన్న ప్రజలు తాము సంతోషంగా బతకాలంటే […]

ఈ 2 వారాలు.... అత్యంత కీలకం.... జాగ్రత్త అత్యవసరం
X

కరోనా మహమ్మారి రోజు రోజుకూ విస్తరణ పెంచుకుంటూ పోతున్న భయంకర పరిస్థితుల్లో… ఈ రెండు వారాలు అత్యంత కీలకం కానున్నాయి. ప్రభావం తక్కువగానే ఉందనుకున్న తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విలయతాండవం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో.. ప్రజలు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన తరుణం వచ్చింది. నిజాముద్దీన్ వెళ్లి వచ్చిన వారి ప్రభావంతో కేసులు పెరుగుతున్నాయని భావిస్తున్న అధికారులు.. రానున్న రెండు వారాల్లో కేసుల సంఖ్య భారీగా పెరగవచ్చని భావిస్తున్నారు.

అందుకే.. ఆరోగ్యంగా ఉన్న ప్రజలు తాము సంతోషంగా బతకాలంటే తప్పనిసరిగా ఇళ్లకే పరిమితం కావాలని కోరుతున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చి.. కరోనాకు గురి కావొద్దని హెచ్చరిస్తున్నారు. నిర్లక్ష్యానికి పోతే.. ప్రాణాలే పోవచ్చని అప్రమత్తం చేస్తున్నారు. అంచనాలు నిజమై.. కేసులు భారీగా బయటపడితే అంతిమంగా నష్టపోయేది ప్రజలే అని అధికారులే కాదు.. వైద్య నిపుణులూ స్పష్టం చేస్తున్నారు.

వైద్య సదుపాయాలు అతి తక్కువగా ఉన్న మన దేశంలో.. ఇప్పటికే కరోనా ప్రభావం పెరుగుతూ పోతోంది. చాలా రాష్ట్రాల్లో కేసులు సెంచరీ మార్క్ దాటేశాయి. ఈ ప్రభావం మరింత పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతటి దారుణమైన పరిస్థితిలోనూ ప్రజలు లాక్ డౌన్ పాటించకుండా రోడ్లపై తిరుగుతున్నారు. పోలీసులు దండిస్తున్నా.. బహిరంగంగా శిక్షిస్తున్నా పట్టింపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వాల హెచ్చరికలు పెడచెవిన పెడుతున్నారు.

అందుకే.. కనీసం ఈ 2 వారాల పాటైనా.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని… ఎవరికి వారు ఇంటి పట్టున ఉంటే.. వైరస్ వ్యాప్తిని సులువుగా నివారించవచ్చునని అంటున్నారు. అలా కాదు.. కూడదంటే.. మన ప్రాణాల మీదకు.. కరోనాను మనమే తెచ్చుకున్నవాళ్లం అవుతాం. అందుకే.. అంతా అర్థం చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి… దేశాన్ని కాపాడే క్రమంలో భాగస్వాములు కండి అని కోరుతున్నారు.

First Published:  2 April 2020 1:40 AM GMT
Next Story