కరోనాతో... బాలీవుడ్, టాలీవుడ్ కు ఎంత నష్టమంటే?
కరోనా వైరస్ మనుషులనే కాదు.. వివిధ రంగాలను చావు దెబ్బ తీస్తోంది. కరోనా ధాటికి దేశంలోని అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. ముఖ్యంగా ఎంటర్ టైన్ మెంట్ రంగానికి కోట్లలో నష్టం వాటిల్లుతోంది. భారీగా పెట్టుబడి పెట్టి సినిమాలు తీసిన నిర్మాతలు.. సినిమా పరిశ్రమ, థియేటర్లు సహా అన్నీ ఇప్పుడు కరోనాతో మూతపడడంతో నష్టాలతో లబోదిబోమంటున్నారు. షూటింగ్ లన్నీ ఆగిపోవడంతో కార్మికులు, సినిమా యూనిట్ సభ్యులు రోడ్డున పడుతున్నారు. ఇక బాలీవుడ్ లో రెండు పెద్ద సినిమాలు రిలీజ్ […]
కరోనా వైరస్ మనుషులనే కాదు.. వివిధ రంగాలను చావు దెబ్బ తీస్తోంది. కరోనా ధాటికి దేశంలోని అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. ముఖ్యంగా ఎంటర్ టైన్ మెంట్ రంగానికి కోట్లలో నష్టం వాటిల్లుతోంది.
భారీగా పెట్టుబడి పెట్టి సినిమాలు తీసిన నిర్మాతలు.. సినిమా పరిశ్రమ, థియేటర్లు సహా అన్నీ ఇప్పుడు కరోనాతో మూతపడడంతో నష్టాలతో లబోదిబోమంటున్నారు. షూటింగ్ లన్నీ ఆగిపోవడంతో కార్మికులు, సినిమా యూనిట్ సభ్యులు రోడ్డున పడుతున్నారు.
ఇక బాలీవుడ్ లో రెండు పెద్ద సినిమాలు రిలీజ్ కు ముందు కరోనా కారణంగా ఆగిపోయాయి. అక్షయ్ కుమార్ హీరోగా ‘సూర్యవంశీ’ రూపొందింది. అజయ్ దేవగణ్, రణవీర్ సింగ్ లతో కలిసి అక్షయ్ ఈ సినిమాలో నటించారు. ఈ మల్టీస్టారర్ కోట్లలో బిజినెస్ చేసింది. డిస్ట్రిబ్యూటర్లు అడ్వాన్సులు ఇచ్చి ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ సినిమా వాయిదా పడడంతో అప్పులు మీద పడి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు లబోదిబోమంటున్నారు.
ఇక బాలీవుడ్ లో మరో సినిమా 1983 పరిస్థితి ఇదే. రణవీర్ సింగ్ నటించిన ఈ సినిమా 1983 ప్రపంచకప్ గెలిచిన కపిల్ మీద తీసింది. ఈ సినిమా కూడా రిలీజ్ కాకపోవడంతో భారీగానే దెబ్బ పడుతోంది.
ఇక తెలుగులోనూ నాని, పవన్, రవితేజ, నిఖిల్, అనుష్క తదితర ఇతర నటుల సినిమాలు ఆగిపోవడంతో వారంతా ఎప్పుడు లాక్ డౌన్ ముగుస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకులు థియేటర్స్ కు వచ్చే పరిస్థితి లేకపోవడంతో అప్పులు మీద పడి సినిమా పరిశ్రమ కుదేలయ్యే పరిస్థితి ఖాయంగా కనిపిస్తోంది.