సౌరవ్ కెప్టెన్సీలోనే తీపిజ్ఞాపకాలు " యువరాజ్
ధోనీ, కొహ్లీల ప్రోత్సాహం అంతంత మాత్రమే భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ తర్వాత తన మనసులో మాట బయటపెట్టాడు. భారతజట్టు తరపున తాను ఎందరు నాయకత్వంలో ఆడినా… సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలోనే తనకు మధురజ్ఞాపకాలు ఉన్నాయని చెప్పాడు. 2007 టీ-20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ విజయాలలో ప్రధానపాత్ర వహించిన యువరాజ్ సింగ్…తనను కెప్టెన్ గా సౌరవ్ గంగూలీ ఎంతగానో ప్రోత్సహించాడని.. అదే మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కొహ్లీల కెప్టెన్సీలో చెప్పుకోదగ్గ ప్రోత్సాహం అందలేదని […]
- ధోనీ, కొహ్లీల ప్రోత్సాహం అంతంత మాత్రమే
భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ తర్వాత తన మనసులో మాట బయటపెట్టాడు. భారతజట్టు తరపున తాను ఎందరు నాయకత్వంలో ఆడినా… సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలోనే తనకు మధురజ్ఞాపకాలు ఉన్నాయని చెప్పాడు.
2007 టీ-20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ విజయాలలో ప్రధానపాత్ర వహించిన యువరాజ్ సింగ్…తనను కెప్టెన్ గా సౌరవ్ గంగూలీ ఎంతగానో ప్రోత్సహించాడని.. అదే మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కొహ్లీల కెప్టెన్సీలో చెప్పుకోదగ్గ ప్రోత్సాహం అందలేదని వాపోయాడు.
38 సంవత్సరాల యువరాజ్ సింగ్ గత ఏడాదే క్రికెట్ నుంచి పూర్తి రిటైర్మెంట్ ప్రకటించాడు. విదేశీలీగ్ ల్లో పాల్గొనటానికి బీసీసీఐ నుంచి అనుమతి తీసుకొన్నా చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయాడు.
భార్య హేజిల్ కీచ్ తో కలసి ఇంటిపట్టునే ఉంటూ కరోనా లాక్ డౌన్ పాటిస్తున్నయువరాజ్ సింగ్…ఆన్ లైన్ ఇంటర్వ్యూలో తన అనుభవాలను వివరించాడు.
2011 వన్డే ప్రపంచకప్ తన జీవితంలో అపూర్వఘట్టమని, తాను ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలవడం, వీడ్కోలు తీసుకొంటున్న సచిన్ కు ప్రపంచకప్ ను కానుకగా ఇవ్వడంలో తనవంతు పాత్ర ఉండటం గర్వకారణమని వివరించాడు.
తనలోని ప్రతిభను కెప్టెన్ గా సౌరవ్ గంగూలీ పూర్తిస్థాయిలో వెలికితీశాడని గుర్తు చేసుకొన్నాడు. తనలో స్ఫూర్తి నింపుతూ ఎంతగానో ప్రోత్సహించాడని…అదే స్థాయి.. ఆదరణ, ప్రోత్సాహం మహీ, కొహ్లీల నుంచి మాత్రం అందలేదని తెలిపాడు.
సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో తగిన అవకాశాలు ఇచ్చినా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయిన యువీ…వన్డే, టీ-20 ఫార్మాట్లలో మాత్రం తన సత్తా ఏపాటిదో చాటుకొన్నాడు.
టీ-20 ప్రపంచకప్ చరిత్రలో ఓ ఓవర్ ఆరుబాల్స్ లో ఆరు సిక్సర్లు బాదిన తొలి, ఏకైక క్రికెటర్ గా యువరాజ్ సింగ్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.