Telugu Global
International

ఐక్యరాజ్య సమితి హెచ్చరిక... దేనికి సంకేతం?

ఐక్యరాజ్య సమితి కీలక హెచ్చరిక చేసింది. రానున్న రోజుల్లో ప్రపంచం అత్యంత సవాల్ తో కూడుకున్న సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందని హెచ్చరించింది. గత రెండు రోజులుగా.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టిస్తున్న మరణ మృదంగంపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. గడచిన 75 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని… ఇది మానవ సంక్షోభానికీ దారి తీసేలా కనిపిస్తోందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ హెచ్చరించారు. ఇదే సమయంలో.. అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ […]

ఐక్యరాజ్య సమితి హెచ్చరిక... దేనికి సంకేతం?
X

ఐక్యరాజ్య సమితి కీలక హెచ్చరిక చేసింది. రానున్న రోజుల్లో ప్రపంచం అత్యంత సవాల్ తో కూడుకున్న సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందని హెచ్చరించింది.

గత రెండు రోజులుగా.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టిస్తున్న మరణ మృదంగంపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. గడచిన 75 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని… ఇది మానవ సంక్షోభానికీ దారి తీసేలా కనిపిస్తోందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ హెచ్చరించారు.

ఇదే సమయంలో.. అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చేతులెత్తేశారు. మృతుల సంఖ్య 4 వేలకు దరి దాపుల్లో ఉన్న సమయంలో.. ప్రస్తుత సమయాన్ని పీడకలగా ట్రంప్ చెప్పారు. మరికొన్ని రోజుల్లో అమెరికాకు మరింత గడ్డు కాలం ఎదురు కానుందన్న ట్రంప్.. ప్రతి పౌరుడూ ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపు ఇచ్చారు. రానున్న 30 రోజులు అత్యంత కీలకంగా చెప్పారు. ఇప్పటికిప్పుడు అద్భుతం చేయలేమన్నారు.

అటు ఐక్య రాజ్య సమితి.. ఇటు అమెరికా చెబుతన్న పరిణామాలకు తోడు.. మన దేశంలో నెలకొన్న పరిస్థితులను కూడా బేరీజు వేసుకుంటే.. నిత్యం వందల్లో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. భవిష్యత్తుపై భయాందోళనలు కలిగిస్తున్నాయి. అన్ని వసతులు ఉన్న అగ్ర రాజ్యాలే అల్లకల్లోలం అవుతుంటే.. అంతంత మాత్రం వైద్య సదుపాయాలు ఉన్న మన దేశం.. ఈ ముప్పును ఎలా ఎదుర్కొంటుందా.. అన్న ఆందోళన కూడా పెరుగుతోంది.

అందుకే.. ప్రజలంతా స్వీయ నియంత్రణ అన్నది ఎంత ముఖ్యమో ఓ సారి ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. మనకేం కాదులే అన్న నిర్లక్ష్యం ప్రదర్శిస్తే.. అదే అంతిమ ఘడియలకు తొలి అడుగు అవుతుందన్న సత్యాన్ని అర్థం చేసుకోవాలని… ప్రతి ఒక్కరూ… జాగ్రత్తగా ఉంటే తప్ప… కరోనాను తరిమికొట్టలేమన్న వాస్తవాన్ని అంతా గ్రహించాలని హెచ్చరిస్తున్నారు.

First Published:  1 April 2020 1:34 PM IST
Next Story