Telugu Global
National

కరోనా సహాయనిధికి... రోహిత్ 80 లక్షలు... సానియా కోటీ 25 లక్షలు...

కోటీ 25 లక్షల నిధులు సేకరించిన సానియా కరోనా వైరస్ తో పోరాటానికి నిధులు కావాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపునకు …భారత క్రీడాలోకం భారీగా స్పందించింది. భారత వన్డే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మొత్తం 80 లక్షల రూపాయల ప్యాకేజీని ప్రకటిస్తే…టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేదలకు ఆహారం అందిస్తూనే …సహాయనిధి కోసం మొత్తం కోటి 25 లక్షల రూపాయలు సేకరించినట్లు ప్రకటించింది. రోహిత్ శర్మ ప్రకటించిన మొత్తం 80 లక్షల రూపాయల విరాళంలో…45 లక్షలు […]

కరోనా సహాయనిధికి... రోహిత్ 80 లక్షలు... సానియా కోటీ 25 లక్షలు...
X
  • కోటీ 25 లక్షల నిధులు సేకరించిన సానియా

కరోనా వైరస్ తో పోరాటానికి నిధులు కావాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపునకు …భారత క్రీడాలోకం భారీగా స్పందించింది. భారత వన్డే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మొత్తం 80 లక్షల రూపాయల ప్యాకేజీని ప్రకటిస్తే…టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేదలకు ఆహారం అందిస్తూనే …సహాయనిధి కోసం మొత్తం కోటి 25 లక్షల రూపాయలు సేకరించినట్లు ప్రకటించింది.

రోహిత్ శర్మ ప్రకటించిన మొత్తం 80 లక్షల రూపాయల విరాళంలో…45 లక్షలు ప్రధానమంత్రి సహాయనిధికి, 25 లక్షలు మహారాష్ట్ర్రముఖ్యమంత్రి సహాయనిధికి, 5 లక్షలు జోమాటో ఫండ్ కు, మరో 5 లక్షలు వీధికుక్కల సహాయనిధికి అందిస్తున్నట్లు తెలిపాడు.

హాకీ ఇండియా 25లక్షల సాయం…

కరోనా సహాయ నిధికి హాకీ ఇండియా తనవంతుగా 25 లక్షల రూపాయల సాయాన్ని ప్రకటించింది. ప్రధానమంత్రి సహాయనిధికి తాము 25 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు హాకీ ఇండియా ప్రకటించింది.

మరోవైపు…భారత మహిళా డబుల్స్ స్టార్ సానియా మీర్జా…లాక్ డౌన్ సమయంలో వందలమంది పేదలకు ఆహారం అందించింది. అంతేకాదు…తన స్నేహితులు, పరిచయం ఉన్నవారి నుంచి వారంరోజుల్లోనే కోటీ 25 లక్షల రూపాయలు విరాళాలు సేకరించింది. ఈ మొత్తంతో లక్షమంది నిరాశ్రయుల ఆకలి తీర్చవచ్చునని తెలిపింది.

జోస్ బట్లర్ టీ-20 షర్టు వేలం…

ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జోస్ బట్లర్…తాను వన్డే ప్రపంచకప్ సాధించిన సమయంలో ధరించిన 63వ నంబర్ జెర్సీని వేలానికి ఉంచాడు. ఈ టీషర్టు వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని..ఇంగ్లండ్ లోని తమ ప్రాంతానికి చెందిన వైద్యసంస్థలకు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించాడు.

రాయల్ బ్రాంప్టన్, హారీఫీల్డ్ హా్స్పిటల్స్ కు తాను టీ-షర్టు వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఇవ్వనున్నట్లు తెలిపాడు. భారత్ కు చెందిన అభిమానులైనా తన టీ-షర్టు వేలంలో పాల్గొవచ్చునని ప్రకటించాడు.

కరోనా వైరస్ తో ప్రపంచ వ్యాప్తంగా 8 లక్షలమంది బాధపడుతుంటే …ఇప్పటి వరకూ 42వేల మరణాలు నమోదయ్యాయి.
బ్రిటన్ లో మాత్రం ప్రధాని బోరిస్ జాన్సన్, ప్రిన్స్ చార్లెస్ లకు సైతం కరోనా వైరస్ సోకింది. మొత్తం 25వేల మంది కరోనా పాజిటివ్ గా తేలితే…1800 మంది మృతి చెందారు.ఇంగ్లండ్ లో సైతం కరోనా తీవ్రత ఎక్కువగానే ఉంది.

First Published:  1 April 2020 9:15 AM IST
Next Story