Telugu Global
International

టోక్యో ఒలింపిక్స్ కు తాజా ముహూర్తం

2021 జులైలో ఒలింపిక్స్ నిర్వహణ కరోనా వైరస్ దెబ్బతో ఏడాదిపాటు వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ ను 2021 జులై-ఆగస్టు మాసాలలో నిర్వహించాలని అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం, నిర్వాహక జపాన్ కలసి నిర్ణయించాయి. వాస్తవంగా 2020 జులై 24 నుంచి ఆగస్టు 9 వరకూ టోక్యో ఒలింపిక్స్ జరగాల్సి ఉంది. పోటీలు నిర్వహించడానికి మరో నాలుగుమాసాల సమయం ఉన్నా కరోనా వైరస్ లాక్ డౌన్ దెబ్బతో వివిధదేశాల నుంచి తీవ్రమైన ఒత్తిడిరావడంతో …వేలకోట్ల రూపాయల నష్టం వాటిల్లే […]

టోక్యో ఒలింపిక్స్ కు తాజా ముహూర్తం
X
  • 2021 జులైలో ఒలింపిక్స్ నిర్వహణ

కరోనా వైరస్ దెబ్బతో ఏడాదిపాటు వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ ను 2021 జులై-ఆగస్టు మాసాలలో నిర్వహించాలని అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం, నిర్వాహక జపాన్ కలసి నిర్ణయించాయి.

వాస్తవంగా 2020 జులై 24 నుంచి ఆగస్టు 9 వరకూ టోక్యో ఒలింపిక్స్ జరగాల్సి ఉంది. పోటీలు నిర్వహించడానికి మరో నాలుగుమాసాల సమయం ఉన్నా కరోనా వైరస్ లాక్ డౌన్ దెబ్బతో వివిధదేశాల నుంచి తీవ్రమైన ఒత్తిడిరావడంతో …వేలకోట్ల రూపాయల నష్టం వాటిల్లే పరిస్థితి ఉన్నా…. తప్పని పరిస్థితిలో పోటీలను ఏడాది వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే…తర్జనభర్జనల అనంతరం కేవలం పోటీల వాయిదాను ప్రకటించిన వారంరోజుల వ్యవధిలోనే తాజా తేదీలను నిర్వాహక సంఘం చైర్మన్ యోషిరో మోరీ ఖరారు చేసి ప్రపంచం ముందుంచారు.

2021 జులై 23 నుంచి ఒలింపిక్స్….

204 దేశాలు తలపడనున్న 2020 టోక్యో ఒలింపిక్స్ ను 2021 జులై 23 నుంచి ఆగస్టు 8 వరకూ నిర్వహించనున్నట్లు జపాన్ ఒలింపిక్స్ సంఘం అధ్యక్షుడు మోరీ ప్రకటించారు.

పారా ఒలింపిక్స్ ను ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 5 వరకూ నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 12.6 బిలియన్ డాలర్ల బడ్జెట్ తో నిర్వహించనున్న ఈ పోటీల కోసం నిర్వాహక సంఘంతో పాటు టోక్యో మెట్రోపాలిటన్, జపాన్ ప్రభుత్వం, అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం ఉమ్మడిగా వేలకోట్ల రూపాయలు కుమ్మరించాయి.

పోటీలను ఏడాదికాలం పాటు వాయిదా వేయడంతో…. నిర్వహణ ఖర్చులు తడిసిమోపెడు కానున్నాయని, అదనపుఖర్చు భరించక తప్పదని నిర్వాహక సంఘం వాపోతోంది.

వైరస్ దెబ్బతో తొలిసారి వాయిదా….

1896 ఏథెన్స్ ఒలింపిక్స్ నుంచి 2016 రియో ఒలింపిక్స్ వరకూ…ప్రపంచ యుద్ధాల సమయంలో మాత్రమే వాయిదా పడిన ఒలింపిక్స్ గేమ్స్ నిరాటంకంగా జరుగుతూనే
వస్తున్నాయి.

అమెరికా, రష్యా కూటమి దేశాల పరస్పర బాయ్ కాట్లతో కొద్దిపాటి ఆటంకాలు ఎదురైనా పోటీలను విజయవంతంగా నిర్వహిస్తూ వచ్చిన అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం… తొలిసారిగా కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ఏడాదిపాటు వాయిదా వేయక తప్పలేదు.

జపాన్ ప్రభుత్వం ధీమా….

2011 లో భూకంపం, ఆ తర్వాత సునామీ, ఫుకిషిమా అణురియాక్టర్ పేలుడు లాంటి విపత్తులు సంభవించినా తాము కోలుకొని విజయవంతంగా అధిగమించామని, కరోనా వైరస్ దెబ్బతో టోక్యో ఒలింపిక్స్ ఏడాదికాలంపాటు వాయిదా పడటంతో వేలకోట్ల రూపాయల మేర నష్టం జరిగినా తట్టుకోగల శక్తి తమకు ఉందని జపాన్ ప్రభుత్వం చెబుతోంది.

భయంకరమైన కరోనా వైరస్ పై మానవాళి సాధించిన విజయానికి ప్రతీకగా టోక్యో ఒలింపిక్స్ ను… రికవరీ ఒలింపిక్స్ పేరుతో నిర్వహిస్తామని ప్రకటించింది.

వివిధ దేశాల హర్షం…

కరోనా వైరస్ విలయతాండవం నేపథ్యంలో ..టోక్యో ఒలింపిక్స్ ను ఏడాదిపాటు వాయిదా వేయటంతో పాటు సరికొత్తగా తేదీలను ప్రకటించడం పట్ల వివిధ దేశాల ఒలింపిక్స్ సంఘాలతో పాటు… అథ్లెట్లు సైతం హర్షం వ్యక్తం చేశారు.

కరోనా వైరస్ భయంతో తాము సాధనకు దూరమైన ఒత్తిడిలో చిక్కుకొన్న సమయంలో పోటీలు వాయిదా వేయటంతో ఊపిరిపీల్చుకొన్నామని…ఇప్పుడు తాజా తేదీలను ప్రకటించడంతో… పరిస్థితి సద్దుమణిగిన తర్వాత తాజా ప్రణాళికలతో శిక్షణ, సన్నాహక కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే…టోక్యో నగరంలో ఏర్పాటు చేసిన క్రీడల తేదీల సూచిక గడియారాన్ని పనిచేయకుండా నిలిపివేశారు.

First Published:  31 March 2020 2:49 AM IST
Next Story