ఈ దశలో జాగ్రత్తగా లేకుంటే.. ముప్పే..!
కరోనా వైరస్ ఎలా ఎవరి ప్రాణాల మీదకు.. ఎప్పుడు వస్తుందో చెప్పలేకుండా ఉన్నాం. ఇలాంటి భయాందోళనకర సమయంలో.. మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన దశ మొదలైంది. మన దేశంలో.. ఇంకా చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాల్లో కరోనా అనుమానితుల క్వారంటైన్ మొదటి దశ అయిన 14 రోజల సమయం పూర్తి కావొచ్చింది. కరోనా లక్షణాల ప్రకారం.. ఈ 14 రోజుల్లోనే వైరస్ సోకిందా లేదా అన్నది బయటపడుతుంది. దేశంలో ఇప్పుడుతున్న పరిస్థితుల ప్రకారం.. చాలా మందికి కరోనా […]
కరోనా వైరస్ ఎలా ఎవరి ప్రాణాల మీదకు.. ఎప్పుడు వస్తుందో చెప్పలేకుండా ఉన్నాం. ఇలాంటి భయాందోళనకర సమయంలో.. మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన దశ మొదలైంది. మన దేశంలో.. ఇంకా చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాల్లో కరోనా అనుమానితుల క్వారంటైన్ మొదటి దశ అయిన 14 రోజల సమయం పూర్తి కావొచ్చింది. కరోనా లక్షణాల ప్రకారం.. ఈ 14 రోజుల్లోనే వైరస్ సోకిందా లేదా అన్నది బయటపడుతుంది.
దేశంలో ఇప్పుడుతున్న పరిస్థితుల ప్రకారం.. చాలా మందికి కరోనా సోకి ఉంటుందేమోనన్న అనుమానం బలపడుతోంది. ఇలాంటి తరుణంలో.. కరోనా వ్యాధిగ్రస్తులు ఎవరన్నది ప్రభుత్వం గుర్తించినదానికంటే మరింత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందన్న భయం పెరుగుతోంది. అందుకే.. మరో వారం పది రోజుల పాటు.. మరింత కఠినంగా లాక్ డౌన్ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
మరీ ముఖ్యంగా.. 60 ఏళ్ల పైబడిన వృద్ధులు, పదేళ్ల లోపు చిన్నారులు.. ఎక్కువగా బయట తిరగకుండా మరింత జాగ్రత్తగా ఉండకపోతే.. ముప్పు ఎలా ముప్పేట దాడి చేసేది చెప్పలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనకు తెలిసిన కరోనా రోగులంతా క్వారంటైన్ లో ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉన్నారు. వచ్చిన చిక్కంతా.. బయటపడని వాళ్ల గురించే. అందుకే.. అంతా అప్రమత్తంగా ఉంటేనే.. కరోనాను వేసవి లోపు దేశం నుంచి తరిమికొట్టవచ్చు.
అందుకే.. ఇంటి పట్టునే ఉందాం. మన ఇంటిని మనం పరిశుభ్రంగా చేసుకుందాం. ఏ మాత్రం జలుబు, దగ్గు, జ్వరం, ఇతర అనారోగ్య లక్షణాలు కనిపించినా అప్రమత్తం అవుదాం. మనల్ని మనం కాపాడుకుంటూ చిన్నలు, పెద్దల పరిరక్షణ చూసుకుందాం. అనుకోకుండా వచ్చిన ఈ సమయాన్ని మంచి పనికే వినియోగిద్దాం. ఇతరులను కలవకుండా ఇంటికే పరిమితం అవుదాం. తప్పనిసరై బయటికి వెళ్తే మాస్క్ తో వెళ్దాం. వచ్చాక పూర్తి పరిశుభ్రత చర్యలు పాటిద్దాం.
గంటకోసారైనా చేతులు శుభ్రం చేసుకుందాం. కుదిరితే శానిటైజర్లు వినియోగిద్దాం. అంతిమంగా.. దేశాన్ని కాపాడుకుందాం. అందరం బాగుందాం.. అందులో మనమూ ఉందాం.