Telugu Global
National

వలస కార్మికులకు భూటియా ఆశ్రయం

కరోనా లాక్ డౌన్ తో వలసకార్మికుల అయోమయం కరోనా వైరస్ లాక్ డౌన్ తో దేశంలోని కోట్లాదిమంది ప్రజలు తమ నివాసాలకే పరిమితమై విశ్రాంతి తీసుకొంటుంటే… బీహార్, బెంగాల్, ఒరిస్సా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర్రాలకు చెందిన వలసకార్మికుల జీవితాలు చిందరవందరగా మారిపోయాయి. రవాణావ్యవస్థ స్తంభించిపోవడంతో కాలినడకనే స్వస్థలాలకు బయలుదేరి నానాపాట్లు పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తుంటే… క్రీడాలోకం మాత్రం కదలి వచ్చి తనవంతు సాయం చేస్తోంది. బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ 50 లక్షల రూపాయల […]

వలస కార్మికులకు భూటియా ఆశ్రయం
X
  • కరోనా లాక్ డౌన్ తో వలసకార్మికుల అయోమయం

కరోనా వైరస్ లాక్ డౌన్ తో దేశంలోని కోట్లాదిమంది ప్రజలు తమ నివాసాలకే పరిమితమై విశ్రాంతి తీసుకొంటుంటే… బీహార్, బెంగాల్, ఒరిస్సా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర్రాలకు చెందిన వలసకార్మికుల జీవితాలు చిందరవందరగా మారిపోయాయి. రవాణావ్యవస్థ స్తంభించిపోవడంతో కాలినడకనే స్వస్థలాలకు బయలుదేరి నానాపాట్లు పడుతున్నారు.

కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తుంటే… క్రీడాలోకం మాత్రం కదలి వచ్చి తనవంతు సాయం చేస్తోంది. బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ 50 లక్షల రూపాయల విలువైన బియ్యాన్ని బెంగాల్ లోని నిరుపేదలకు పంచిపెడితే… మాస్టర్ సచిన్ టెండుల్కర్ తనవంతుగా మహారాష్ట్ర
కేంద్రప్రభుత్వాలకు 25 లక్షల రూపాయల చొప్పున సాయం అందచేశాడు.

బరోడాకు చెందిన పఠాన్ బ్రదర్స్ తమవంతుగా 4వేల మాస్క్ లను పోలీసుల ద్వారా
పేదప్రజలకు అందచేసి తమ దాతృత్వాన్ని చాటుకొన్నారు.

అయితే… భారత ఫుట్ బాల్ దిగ్గజం బైచుంగ్ భూటియా మరో అడుగు ముందుకు వేసి..తన రాష్ట్ర్రం సిక్కింలో చిక్కుకుపోయిన బెంగాల్, బీహార్ లకు చెందిన వలసకార్మికులకు ఆశ్రయం ఇవ్వాలని నిర్ణయించాడు.

గాంగ్టక్ లో 100 మందికి ఆశ్రయం…

సిక్కిం రాజధానిలో పనుల కోసం బీహార్ , ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చిన వలసకార్మికులు కరోనా లాక్ డౌన్ తో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు.

పనులు లేక, చేతిలో చిల్లిగవ్వలేక, ఎక్కడ ఉండాలో తెలియక అల్లాడిపోతుంటే చూసి… బైచుంగ్ భూటియా తట్టుకోలేకపోయాడు.

గ్యాంగ్టక్ లోని టాడాంగ్ లుమ్సే ప్రాంతంలో తాను కొత్తగా నిర్మించిన భవనంలో 100 మంది వలస కార్మికులకు ఆశ్రయం కల్పించి… వారి బాగోగులు చూసుకొంటున్నాడు.

తాను నిర్మించిన నాలుగు అంతస్థుల భవంతిలో నిరాశ్రయులైన కార్మికులకు బస కల్పించానని, ప్రభుత్వం వైద్యసదుపాయాలు కల్లించాలని కోరాడు.

పర్వతప్రాంత రాష్ట్ర్రమైన సిక్కింలో సగటుమనిషి బస చేయటానికి చోటు దొరకడమే కష్టం. అయితే … బైచుంగ్ భూటియా మాత్రం పెద్దమనసుతో 100 మంది వలస కార్మికులకు ఆశ్రయం ఇవ్వడం పట్ల క్రీడావర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.

సిక్కిం రాష్ట్ర్రవ్యాప్తంగా కర్ఫ్యూ అమలులో ఉందని…. ఆ విషయం తెలియక వలసకార్మికులు కాలినడకన తమతమ ప్రాంతాలకు తిరుగుపయనమయ్యారని, ఇది చాలా బాధాకరమని… వీరందరినీ ఆదుకొని, ఆశ్రయం కల్పించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని బైచుంగ్ భూటియా విజ్ఞప్తి చేశాడు.

First Published:  31 March 2020 3:25 AM IST
Next Story