Telugu Global
International

అమెరికాలో కరోనా విలయతాండవం

10 లక్షల మందికి కరోనా పరీక్షలు 1,63,000 కరోనా పాజిటీవ్ కేసులు ఒకే రోజు 540 మంది మృతి అగ్రరాజ్యం అని పిలిపించుకునే అమెరికా ఇప్పుడు కరోనా కేసుల్లోనూ అగ్రస్థానంలో నిలిచింది. దేశ పరిపాలకుల అలసత్వం కారణంగా చైనా, ఇటలీ కంటే వేగంగా అక్కడ వైరస్ ప్రబలుతోంది. కరోనా వైరస్ మొదటి, రెండు దశలను కూడా దాటేసి మూడో స్టేజ్‌కు అతి తక్కువ సమయంలోనే చేరుకుంది. ఇప్పటి వరకు అమెరికాలో 1,63,000 మంది కరోనా పాజిటీవ్‌లుగా గుర్తించగా.. […]

అమెరికాలో కరోనా విలయతాండవం
X
  • 10 లక్షల మందికి కరోనా పరీక్షలు
  • 1,63,000 కరోనా పాజిటీవ్ కేసులు
  • ఒకే రోజు 540 మంది మృతి

అగ్రరాజ్యం అని పిలిపించుకునే అమెరికా ఇప్పుడు కరోనా కేసుల్లోనూ అగ్రస్థానంలో నిలిచింది. దేశ పరిపాలకుల అలసత్వం కారణంగా చైనా, ఇటలీ కంటే వేగంగా అక్కడ వైరస్ ప్రబలుతోంది. కరోనా వైరస్ మొదటి, రెండు దశలను కూడా దాటేసి మూడో స్టేజ్‌కు అతి తక్కువ సమయంలోనే చేరుకుంది.

ఇప్పటి వరకు అమెరికాలో 1,63,000 మంది కరోనా పాజిటీవ్‌లుగా గుర్తించగా.. వారిలో 3,016 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. మరోవైపు ఒక్క సోమవారమే 540 మంది మరణించడం అక్కడి భయంకర పరిస్థితికి నిదర్శనం.

అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లోనే కరోనా బాధితులు అధికంగా ఉన్నారు. ఆసుపత్రులన్నీ కరోనా పేషెంట్లతోనే నిండిపోవడంతో ఇతర జబ్బులతో ఆసుపత్రికి వచ్చే వారికి వైద్య సేవలు కూడా సరిగా అందడం లేదు. దీంతో ఒక భారీ నౌకను ఆసుపత్రిగా మార్చేశారు.

హడ్సన్ నదిలో ఒక ఒడ్డుకు నిలిపిన ఈ నౌకను ఆసుపత్రిగా ఉపయోగిస్తున్నారు. కాగా, కాలిఫోర్నియాలో కూడా కరోనా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ విషయాన్ని గవర్నర్ గావిన్ న్యూసమ్ తెలిపారు.

మరోవైపు అమెరికా తమ దేశంలో కరోనా నిర్థారణ పరీక్షలను వేగవంతం చేసింది. సాధ్యమైనంత ఎక్కువ మందికి వైద్య పరీక్షలు నిర్వహించి.. పాజిటీవ్ వచ్చిన వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇప్పటి వరకు 10 లక్షల మందికి వ్యాది నిర్థారణ పరీక్షలు నిర్వహించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇతర దేశాల్లో ఉండిపోయిన పాతిక వేల మందిని స్వదేశానికి తీసుకువచ్చామని… ఇండియాలో ఉన్న అమెరికన్ లను కూడా త్వరలోనే స్వదేశానికి తీసుకొస్తామని అధికార వర్గాలు చెప్పాయి.

ఇతర దేశాల్లో దాదాపు 9 వేల మంది అమెరికన్ లు స్వదేశానికి వస్తామని వినతులు పంపారని.. త్వరలోనే వీరిని తీసుకొని రావడానికి సరైన చర్యలు తీసుకుంటామన్నారు.

First Published:  31 March 2020 5:42 AM IST
Next Story