Telugu Global
International

భార్యభర్త బాల్కనీ మారథాన్

దుబాయ్ లో సౌతాఫ్రికాజంట సంచలనం ప్రపంచ దేశాల ప్రజలంతా కరోనా వైరస్ భయంతో ..లాక్ డౌన్ పాటిస్తూ ఇంటిపట్టునే భయంభయంగా ఉంటుంటే..మరోవైపు దుబాయ్ లో నివాసం ఉంటున్న సౌతాఫ్రికా జంట 26 మైళ్లు ( 42.2 కిలోమీటర్ల ) మారథాన్ పరుగును పూర్తి చేసి సంచలనం సృష్టించారు. శిక్షలు కఠినంగా అమలు చేసే దుబాయ్ లాంటి దేశంలో…. అదీ కరోనా లాక్ డౌన్ పాటిస్తున్న సమయంలో భార్యాభర్త కలసి మారథాన్ పరుగు పూర్తి చేయడం ఏంటంటూ ఆశ్చర్యపోకండి. […]

భార్యభర్త బాల్కనీ మారథాన్
X
  • దుబాయ్ లో సౌతాఫ్రికాజంట సంచలనం

ప్రపంచ దేశాల ప్రజలంతా కరోనా వైరస్ భయంతో ..లాక్ డౌన్ పాటిస్తూ ఇంటిపట్టునే భయంభయంగా ఉంటుంటే..మరోవైపు దుబాయ్ లో నివాసం ఉంటున్న సౌతాఫ్రికా జంట 26 మైళ్లు ( 42.2 కిలోమీటర్ల ) మారథాన్ పరుగును పూర్తి చేసి సంచలనం సృష్టించారు.

శిక్షలు కఠినంగా అమలు చేసే దుబాయ్ లాంటి దేశంలో…. అదీ కరోనా లాక్ డౌన్ పాటిస్తున్న సమయంలో భార్యాభర్త కలసి మారథాన్ పరుగు పూర్తి చేయడం ఏంటంటూ ఆశ్చర్యపోకండి.

కరోనా వైరస్ ను చూసి భయపడాల్సిన పనిలేదని, ఇంటిపట్టునే ఉంటే జయించవచ్చునని, సొంత అపార్ట్ మెంట్ బాల్కనీలో పరుగెత్తడం ద్వారా ప్రజల్లో భయం పోగట్టడానికే తామూ బాల్కనీ మారథాన్ ను పూర్తి చేశామని ప్రకటించారు.

దుబాయ్ నగరంలోని తమ అపార్ట్ మెంట్ బాల్కనీలో 20 మీటర్ల దూరాన్ని 42 సంవత్సరాల కోలిన్ అలిన్ తన భార్య హిల్డాతో కలసి…. ఆ చివరి నుంచి ఈ చివరకు, ఈ చివర నుంచి ఆ చివరకు 2,100సార్లు పరుగెత్తడం ద్వారా చరిత్ర సృష్టించాడు.

మహానగరాలలో, ఎడారుల్లో, మంచుకొండల్లో, చివరకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనాల మెట్లపైన మారథాన్ పోటీలు నిర్వహించడం మనకు తెలుసు. కరోనా వైరస్ పుణ్యమా అంటూ ఇప్పుడు సరికొత్తగా బాల్కనీ మారథాన్ సైతం వచ్చి చేరింది.

5 గంటల 9 నిముషాల 39 సెకన్ల రికార్డు…

కోలిన్-హిల్డాజంట ..తమ బాల్కనీలోని 20 అడుగుల దూరాన్ని 5 గంటల 9 నిముషాల 39 సెకన్ల సమయంలో 2,100 సార్లు పరుగెత్తడం ద్వారా…మొత్తం 42.2 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసి పరస్పరం అభినందించుకొన్నారు.

కరోనా వైరస్ ను జయించాలంటే లాక్ డౌన్ పాటించి…ఇంటికే పరిమితం కావాలంటూ పిలుపునిచ్చారు. తమ కుమార్తె, 10 సంవత్సరాల జీనా మారథాన్ డైరెక్టర్ గా వ్యవహరించింది.

అవిశ్రాంతంగా పరుగెత్తిన అమ్మానాన్నలకు మంచినీరు, స్నాక్స్ అందించడం ద్వారా తనవంతు బాధ్యత నిర్వర్తించింది. అంతేకాదు.. స్టాప్ వాచ్ తో తమ పరుగు సమయాన్ని నమోదు చేసుకొన్నారు.

బుర్జా ఖలీఫా పై లాక్ డౌన్ ప్రచారం…

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన దేశాలలో ఒకటైన అరబ్ ఎమిరేట్స్ సముదాయంలోని దుబాయ్ ను సైతం కరోనా వైరస్ విడిచి పెట్టలేదు. 468 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా…ఇద్దరు మృతి చెందారు. దీనితో దుబాయ్ పాలకులు గురువారం నుంచి ఆదివారం వరకూ రాత్రి వేళల్లో మాత్రమే లాక్ డౌన్ ను ప్రకటించారు.

విలాసాలకు నిలయమైన దుబాయ్ లో రాత్రివేళల్లోనే జీవితం ఉంటుంది. ఈ కారణంగానే రాత్రి సమయాలలో లాక్ డౌన్ ను ప్రభుత్వం అమలు చేసింది.

దుబాయ్ లో నిర్మించిన…ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా ఆకాశహార్మ్యాన్ని లాక్ డౌన్ ప్రచారం కోసం వినియోగించారు.

First Published:  30 March 2020 3:00 AM IST
Next Story