Telugu Global
International

వెయ్యి దాటిన కరోనా కేసులు... వచ్చే 2 వారాలు కీలకం

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఆదివారం రాత్రికి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1024కి చేరింది. ఇప్పటివరకూ 27 మంది చనిపోయారు. 96 మంది వైరస్‌బారిన పడి కోలుకున్నారు. మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. కరోనా కేసుల సంఖ్య 203 దాటింది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 22 కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్ర తర్వాత కేరళలో వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా 20 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 202కి […]

వెయ్యి దాటిన కరోనా కేసులు... వచ్చే 2 వారాలు కీలకం
X

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఆదివారం రాత్రికి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1024కి చేరింది. ఇప్పటివరకూ 27 మంది చనిపోయారు. 96 మంది వైరస్‌బారిన పడి కోలుకున్నారు.

మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. కరోనా కేసుల సంఖ్య 203 దాటింది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 22 కేసులు బయటపడ్డాయి.

మహారాష్ట్ర తర్వాత కేరళలో వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా 20 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 202కి చేరింది.

కర్నాటకలో కేసుల సంఖ్య 83కి చేరింది. గుజరాత్‌లో బాధితుల సంఖ్య 58. ఢిల్లీలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక్కడ 72 మందికి పాజిటివ్‌గా తేలింది.

విదేశాల నుంచి రాకపోకలు తగ్గిపోవడంతో లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌ కేసులు ఇప్పుడు బయటపడుతున్నాయి. స్పెస్‌జెట్‌ పైలెట్‌కు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. మార్చి 21న చెన్నై నుంచి ఢిల్లీకి విమానాన్ని నడిపినట్లు చెప్పింది. ఆయనతో పాటు పనిచేసిన సిబ్బందిని 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని సంస్థ సూచించింది.

దేశవ్యాప్తంగా లోకల్‌ ట్రాన్స్‌ మిషన్‌ కేసులు బయటపడుతున్నాయి… దీంతో వచ్చే రెండు వారాలు కీలకమని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ రెండు వారాలు కరోనా వ్యాప్తిని కట్టడి చేస్తే…. కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. దక్షిణ కొరియాలో ఒకే వ్యక్తి వల్ల 5 వేల మందికి కరోనా సోకినట్లు తేలిందని… ఇక్కడ కూడా జనం జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

First Published:  30 March 2020 5:04 AM IST
Next Story