Telugu Global
National

మీడియాపై నిప్పులు చెరిగిన సాక్షి ధోనీ

తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం భారత మాజీ కెప్టెన్, క్రికెట్ శ్రీమంతుడు మహేంద్రసింగ్ ధోనీ భార్య సాక్షికి కోపం వచ్చింది. సోషల్, ఎలక్ట్ర్రానిక్ మీడియా ద్వారా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న మీడియాను చెడామడా తిట్టిపెట్టింది. కరోనా బాధితుల సహాయనిధికి మాస్టర్ సచిన్ టెండుల్కర్ 50 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటిస్తే, సౌరవ్ గంగూలీ 50 లక్షల రూపాయల విలువైన బియ్యాన్ని బెంగాల్ లో నిరుపేదలకు పంచిపెడితే…కోట్లరూపాయలకు అధిపతి మహేంద్రసింగ్ ధోనీ ఓ ఎన్జీవో సంస్థ ద్వారా లక్ష […]

మీడియాపై నిప్పులు చెరిగిన సాక్షి ధోనీ
X
  • తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం

భారత మాజీ కెప్టెన్, క్రికెట్ శ్రీమంతుడు మహేంద్రసింగ్ ధోనీ భార్య సాక్షికి కోపం వచ్చింది. సోషల్, ఎలక్ట్ర్రానిక్ మీడియా ద్వారా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న మీడియాను చెడామడా తిట్టిపెట్టింది.

కరోనా బాధితుల సహాయనిధికి మాస్టర్ సచిన్ టెండుల్కర్ 50 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటిస్తే, సౌరవ్ గంగూలీ 50 లక్షల రూపాయల విలువైన బియ్యాన్ని బెంగాల్ లో నిరుపేదలకు పంచిపెడితే…కోట్లరూపాయలకు అధిపతి మహేంద్రసింగ్ ధోనీ ఓ ఎన్జీవో సంస్థ ద్వారా లక్ష రూపాయల విలువైన మాస్క్ లు పంచిపెట్టి.. చేతులు దులుపుకొన్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో నెటిజన్లు తమదైన శైలిలో… ధోనీని ఆటపట్టించారు. కరోనా బాధితుల కోసం.. చాలా గొప్ప సాయం చేశారంటూ సెటైర్లు వేశారు.

ఈవార్త వైరల్ కావడంతో… ధోనీభార్య సాక్షికి చిర్రెత్తుకొచ్చింది. ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రసారం చేసే సంస్థలకు చివాట్లు పెట్టింది. వార్తలు వేసే ముందు నిజమో ..కాదో తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా అంటూ మండిపడింది.

అసలైన జర్నలిజం విలువలకు నిలువుటద్దంలాంటి మీడియా సంస్థలు చచ్చిపోయాయా అంటూ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించింది. తప్పుడువార్తలు ప్రచారం చేసే మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసింది.

ఇలాంటి క్లిష్ట సమయంలో…మనోభావాలు దెబ్బతీసే తప్పుడు వార్తలు ప్రచురించ వద్దంటూ వేడుకొంది. భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ… క్రికెట్ ద్వారా వందలకోట్ల రూపాయలు సంపాదించి శ్రీమంతులుగా ఉన్నారు.

ఈ ముగ్గురు మొనగాళ్లు ఇప్పటి వరకూ తమవంతుగా కరోనా వైరస్ బాధితులకు ఎంత మొత్తం సాయం చేయాలో ప్రకటించకపోడం సైతం… నెటిజన్లు, అభిమానుల్లో అసహనానికి కారణంగా మారింది.

First Published:  29 March 2020 3:04 AM IST
Next Story