Telugu Global
National

కష్టకాలంలో శుభవార్త చెప్పిన ఈపీఎఫ్

కరోనా వైరస్ దేశంలో మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. దీంతో నిత్యావసరాలు, అత్యవసర సేవలు మినహా అన్ని సంస్థలు కూడా మూతబడ్డాయి. అందులో పని చేసే వాళ్లు వర్క్ ఫ్రం హోం చేయడమో… వీలు లేని వాళ్లు ఇంట్లో ఖాళీగా ఉండటమో చేస్తున్నారు. ఉద్యోగులు, సంఘటిత రంగ కార్మికులకు ఇప్పుడు పెద్ద కష్టమొచ్చిపడింది. దాదాపు నెల రోజుల పాటు ఇంట్లోనే ఉంటే సంస్థ లేదా యాజమాన్యం వేతనాలు చెల్లిస్తుందా లేదా..! […]

కష్టకాలంలో శుభవార్త చెప్పిన ఈపీఎఫ్
X

కరోనా వైరస్ దేశంలో మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. దీంతో నిత్యావసరాలు, అత్యవసర సేవలు మినహా అన్ని సంస్థలు కూడా మూతబడ్డాయి. అందులో పని చేసే వాళ్లు వర్క్ ఫ్రం హోం చేయడమో… వీలు లేని వాళ్లు ఇంట్లో ఖాళీగా ఉండటమో చేస్తున్నారు.

ఉద్యోగులు, సంఘటిత రంగ కార్మికులకు ఇప్పుడు పెద్ద కష్టమొచ్చిపడింది. దాదాపు నెల రోజుల పాటు ఇంట్లోనే ఉంటే సంస్థ లేదా యాజమాన్యం వేతనాలు చెల్లిస్తుందా లేదా..! అనే అనుమానాలు తొలిచి వచేస్తున్నాయి.

కాగా, లాక్‌డౌన్ సమయంలో తెలంగాణలోని అన్ని కర్మాగారాలు, సంస్థలు, ఫ్యాక్టరీలు వేతనంతో కూడిన సెలవును కార్మికులు, ఉద్యోగులకు ఇవ్వాలని కార్మిక మంత్రి మల్లారెడ్డి శనివారం ఆదేశాలు జారీ చేశారు. అలాగే నిర్మాణ రంగంలోని కార్మికులకు ఈ 21 రోజులు వసతి, భోజనం కల్పించాలని.. దీనిపై క్షేత్రస్థాయిలో కార్మిక శాఖ అధికారులు, నోడల్ అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు.

మరోవైపు యాజమాన్యాలు వేతనాలు చెల్లించకపోతే కష్టకాలంలో ఆదుకోవడానికి ఈపీఎఫ్ సంస్థ ముందుకు వచ్చింది. సాధారణంగా ఉద్యోగానికి రాజీనామా చేసిన రెండు నెలల తర్వాత కానీ, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే పీఎఫ్ విత్‌డ్రా చేసుకునే వెసులు బాటు ఉండగా.. ఇప్పుడు ఆ నిబంధనలను తొలగించింది.

ఆన్‌లైన్‌లో ప్రతీ ఉద్యోగి పీఎఫ్ డ్రా చేసుకోవచ్చని తెలిపింది. ఏ ఉద్యోగి అయినా మూడు నెలల బేసిక్ వేతనం లేదా పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతం.. ఏది తక్కువైతే దానిని డ్రా చేసుకోవచ్చని చెప్పింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.

First Published:  29 March 2020 4:51 AM IST
Next Story