కరోనాతో పోరుకు బీసీసీఐ భారీవిరాళం
సౌరవ్ గంగూలీ 50 లక్షల రూపాయల బియ్యం పంపిణీ కరోనా వైరస్ తో భారత ప్రభుత్వం, 130 కోట్ల జనం జరుపుతున్న పోరాటంలో పాలు పంచుకోవాలని భారత క్రికెట్ నియంత్రణమండలి నిర్ణయించింది. తనవంతుగా అనుబంధ క్రికెట్ సంఘాలతో కలసి… ప్రధానమంత్రి కరోనా నియంత్రణ నిధికి 51 కోట్ల రూపాయల భారీ విరాళం ఇస్తున్నట్లు బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షా ప్రకటించారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఇప్పటికే ప్రధానమంత్రి సహాయనిధికి 25 లక్షల […]
- సౌరవ్ గంగూలీ 50 లక్షల రూపాయల బియ్యం పంపిణీ
కరోనా వైరస్ తో భారత ప్రభుత్వం, 130 కోట్ల జనం జరుపుతున్న పోరాటంలో పాలు పంచుకోవాలని భారత క్రికెట్ నియంత్రణమండలి నిర్ణయించింది. తనవంతుగా
అనుబంధ క్రికెట్ సంఘాలతో కలసి… ప్రధానమంత్రి కరోనా నియంత్రణ నిధికి 51 కోట్ల రూపాయల భారీ విరాళం ఇస్తున్నట్లు బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షా ప్రకటించారు.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఇప్పటికే ప్రధానమంత్రి సహాయనిధికి 25 లక్షల రూపాయలు, మహారాష్ట్ర్ర ముఖ్యమంత్రి సహాయనిధికి 25 లక్షల రూపాయలు తనవంతుగా అందచేశాడు.
మరోవైపు బెంగాల్ క్రికెట్ సంఘం సైతం బెంగాల్ ముఖ్యమంత్రి సహాయనిధికి 25 లక్షల రూపాయలు జమచేసింది. బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ వ్యక్తిగతంగా… 50 లక్షల రూపాయల విలువైన బియ్యాన్ని తన రాష్ట్ర్రంలోని పేదప్రజలకు పంచిపెట్టాడు.
భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా 31 లక్షల రూపాయలు ప్రధానమంత్రి సహాయనిధికి, 21 లక్షల రూపాయలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి పంపినట్లు తెలిపాడు.
యువరన్నర్ హిమాదాస్ తన నెలరోజుల జీతాన్ని అసోం ముఖ్యమంత్రి సహాయనిధికి ఇస్తున్నట్లు ప్రకటించింది. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు…ఇప్పటికే.. తెలుగు రాష్ట్ర్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 5 లక్షల రూపాయల చొప్పున అందచేసింది.
భారత వస్తాదు భజరంగ్ పూనియా…తన ఆరు నెలల జీతాన్ని కరోనా వైరస్ బాధితుల సహాయం కోసం ఇస్తున్నట్లు ప్రకటించాడు.
మరోవైపు… ముంబైలోని క్రికెట్ మైదానాల సిబ్బంది కోసం ముంబై ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ యజమానులు 8 లక్షల రూపాయలు అందచేశారు.
భారత ప్రభుత్వం ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ సమయంలో దేశంలోని 80 కోట్ల మంది నిరుపేదలు, దిగువతరగతి ప్రజల కోసం కోటీ 70 లక్షల రూపాయల ప్యాకేజీని ప్రకటించి చర్యలు తీసుకుంటోంది. దీనికితోడు ప్రజలు సైతం తమకు తోచిన విరాళాలను ప్రభుత్వాలకు అందచేయాలని పిలుపునిచ్చారు.