Telugu Global
International

ఆస్ట్ర్రేలియా సరిహద్దులు 6 మాసాలపాటు మూత

టీ-20 ప్రపంచకప్ కూ వాయిదా గండం కరోనా వైరస్ ముప్పుతో ఆస్ట్ర్రేలియా ఆరుమాసాలపాటు తన దేశానికి రాకపోకలు నిషేధించింది. సరిహద్దులను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మరో ఏడుమాసాలలో ఆస్ట్ర్రేలియా వేదికగా జరగాల్సిన 2020 టీ-20 ప్రపంచకప్ ను సైతం నిర్వహించడం అనుమానంగా మారింది. ఇదే అంశమై…ఐసీసీ నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పాలకమండలి దేశాల సభ్యులతో చర్చించింది. ఈ సమావేశంలో భారత్ తరపున బీసీసీఐ చైర్మన్ హోదాలో సౌరవ్ గంగూలీ పాల్గొన్నారు. అక్టోబర్లో ప్రపంచకప్ అనుమానమే? ప్రపంచ దేశాలను […]

ఆస్ట్ర్రేలియా సరిహద్దులు 6 మాసాలపాటు మూత
X
  • టీ-20 ప్రపంచకప్ కూ వాయిదా గండం

కరోనా వైరస్ ముప్పుతో ఆస్ట్ర్రేలియా ఆరుమాసాలపాటు తన దేశానికి రాకపోకలు నిషేధించింది. సరిహద్దులను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మరో ఏడుమాసాలలో ఆస్ట్ర్రేలియా వేదికగా జరగాల్సిన 2020 టీ-20 ప్రపంచకప్ ను సైతం నిర్వహించడం అనుమానంగా మారింది.

ఇదే అంశమై…ఐసీసీ నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పాలకమండలి దేశాల సభ్యులతో చర్చించింది. ఈ సమావేశంలో భారత్ తరపున బీసీసీఐ చైర్మన్ హోదాలో సౌరవ్ గంగూలీ పాల్గొన్నారు.

అక్టోబర్లో ప్రపంచకప్ అనుమానమే?

ప్రపంచ దేశాలను మాత్రమే కాదు…ఆస్ట్ర్రేలియాను సైతం కరోనా వైరస్ మహమ్మారి గడగడలాడిస్తోంది. ఇప్పటికే కంగారూ ల్యాండ్ లో 3వేలమందికి కరోనా వైరస్ సోకగా.. 100 మంది మృతి చెందినట్లు ఆస్ట్ర్రేలియా వైద్యశాఖ అధికారికంగా ప్రకటించింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా… తమ దేశసరిహద్దులను ఆరుమాసాలపాటు మూసివేస్తున్నట్లు ఆస్ట్ర్రేలియా ప్రభుత్వం తెలిపింది.

ఇతర దేశాలతో ఆస్ట్ర్రేలియాకు రాకపోకలు ఆరునెలల పాటు నిలిచిపోడంతో…అక్టోబర్లో జరగాల్సిన టీ-20
ప్రపంచకప్ పరిస్థితి సైతం అగమ్యగోచరంగా తయారయ్యింది.

అయితే…మరో ఏడుమాసాల కాలంలో కరోనా వైరస్ సద్దుమణిగి..సాధారణ పరిస్థితి నెలకొంటే…ఆస్ట్ర్రేలియా వేదికగానే పోటీలు నిర్వహించడం ఖాయమని ఐసీసీ భావిస్తోంది.

కరోనా వైరస్ దెబ్బతో జులైలో టోక్యో వేదికగా జరగాల్సిన 2020 ఒలింపిక్స్ ఏడాదిపాటు వాయిదా పడటం, యూరోపియన్ కప్ ఫుట్ బాల్, కోపా అమెరికాకప్ తో సహా పలు అంతర్జాతీయ పోటీలు వాయిదా పడటమో లేక రద్దు కావటమో ఇప్పటికే జరిగిపోయాయి.

భారత్ కు బకాయిల చెల్లింపు ఎప్పుడు?

2016 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కు ఆతిథ్యమిచ్చిన బీసీసీఐకి.. ఐసీసీ 237 మిలియన్ డాలర్ల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. గత నాలుగేళ్లుగా ఈ మొత్తాన్ని ఇవ్వకుండా.. ఐసీసీ తాత్సారం చేస్తూ ఉండడంతో…వివాదాల పరిష్కార కమిటీకి సౌరవ్ గంగూలీ నివేదించాడు.

అప్పట్లో ప్రభుత్వం ప్రపంచకప్ ఆదాయానికి పన్ను మినహాయింపు ఇవ్వకపోడంతో …ఈ మొత్తాన్ని ఐసీసీ తొక్కిపట్టింది. బీసీసీఐకి చెల్లించడానికి నిరాకరించింది. ఈ మొత్తాన్ని ఏదో విధంగా వసూలు చేయాలన్న పట్టుదలతో బీసీసీఐ
చైర్మన్ సౌరవ్ గంగూలీ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

కరోనా వైరస్ దెబ్బతో ఐసీసీతో పాటు భారత క్రికెట్ కార్యకలాపాలు సైతం స్తంభించిపోయాయి. క్రికెటర్లంతా ఇంటిపట్టునే ఉంటూ…లాక్ డౌన్ విధిగా పాటించమంటూ.. వీడియో సందేశాల ద్వారా అభిమానులను కోరుతూ కాలక్షేపం చేస్తున్నారు.

First Published:  28 March 2020 3:30 AM IST
Next Story