కరోనాపై రెచ్చగొట్టే పోస్ట్ " సాప్ట్‌వేర్ ఉద్యోగం ఊస్ట్
కరోనా వైరస్ నేపథ్యంలో రెచ్చగొట్టే పోస్ట్‌లు పెట్టిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఊడింది. బెంగళూర్ కు చెందిన ముజీబ్ అహ్మద్ తన పేస్‌బుక్ పోస్టులో వైరస్ వ్యాప్తిపై అనుచిత పోస్టులు పెట్టాడు. బయటకు వెళ్లండి…వైరస్‌ను వ్యాప్తి చేయండి అంటూ పోస్టులు పెట్టాడు. దీనిపై బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదులు వెళ్లడంతో వెంటనే స్పందించారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు బెంగళూరు సీసీబీ జాయింట్ కమిషనర్ సందీప్ పాటిల్ చెప్పారు. ఇన్ఫోసిస్ కంపెనీలో […]
కరోనా వైరస్ నేపథ్యంలో రెచ్చగొట్టే పోస్ట్‌లు పెట్టిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఊడింది. బెంగళూర్ కు చెందిన ముజీబ్ అహ్మద్ తన పేస్‌బుక్ పోస్టులో వైరస్ వ్యాప్తిపై అనుచిత పోస్టులు పెట్టాడు. బయటకు వెళ్లండి…వైరస్‌ను వ్యాప్తి చేయండి అంటూ పోస్టులు పెట్టాడు. దీనిపై బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదులు వెళ్లడంతో వెంటనే స్పందించారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు బెంగళూరు సీసీబీ జాయింట్ కమిషనర్ సందీప్ పాటిల్ చెప్పారు.
ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలియడంతో ఆ కంపెనీకి కూడా అతనిపై ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో విచారణ జరిపి… అతను చేసిన పోస్టులు నిజమేనని నిర్ధారించుకుంది. ఉద్యోగంలో నుంచి తీసివేస్తున్నట్లు ప్రకటించింది. అతనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు సంస్థ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేసింది. తమ కంపెనీ పాలసీలకు విరుద్ధంగా ఉందని.. అతన్ని ఉద్యోగంలో నుంచి తీసివేసినట్లు తెలిపింది.
కరోనాపై అనవసరమైన పుకార్లు, ఫేక్ పోస్టులు వ్యాప్తి చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. కొంతమంది ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెట్టడంతో పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు.