ఐదే నిమిషాల్లో కరోనా టెస్ట్ రిజల్ట్... సరికొత్త టెక్నాలజీ..!
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబలిస్తోంది. ఒక వ్యక్తికి కరోనా సోకిందో లేదో తెలుసుకోవడానికి రెండు రోజుల సమయం పడుతుండటంతో టెన్షన్‌తో ఇటు రోగి.. ఏ వైద్యం చేయాలో తెలియక డాక్టర్లు సతమతమవుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కరోనా బాధితులు అమెరికాలో ఉన్నారు. దీంతో ప్రభుత్వం అనుమానితులందరికీ కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించింది. కానీ కరోనా పరీక్ష ఫలితాలు రావడానికి చాలా ఆలస్యమవుతోంది. కాగా, కరోనా పరీక్షల సమయాన్ని తగ్గించడానికి అమెరికాలోని అబోట్ లేబోరేటరీస్ సరికొత్త విధానం తయారు […]
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబలిస్తోంది. ఒక వ్యక్తికి కరోనా సోకిందో లేదో తెలుసుకోవడానికి రెండు రోజుల సమయం పడుతుండటంతో టెన్షన్‌తో ఇటు రోగి.. ఏ వైద్యం చేయాలో తెలియక డాక్టర్లు సతమతమవుతున్నారు.
ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కరోనా బాధితులు అమెరికాలో ఉన్నారు. దీంతో ప్రభుత్వం అనుమానితులందరికీ కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించింది. కానీ కరోనా పరీక్ష ఫలితాలు రావడానికి చాలా ఆలస్యమవుతోంది.
కాగా, కరోనా పరీక్షల సమయాన్ని తగ్గించడానికి అమెరికాలోని అబోట్ లేబోరేటరీస్ సరికొత్త విధానం తయారు చేసింది. ఈ టెక్నాలజీతో కరోనా పాజిటీవ్ లేదా నెగెటీవ్ అని ఐదు నిమిషాల్లోనే నిర్థారించుకోవచ్చని చెబుతున్నారు. దీనికి ఆ దేశంలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కూడా అనుమతి ఇచ్చింది.
కాగా, అది తాత్కాలిక అనుమతులేనని.. పూర్తి స్థాయిలో అనుమతులు రాలేదని అబోట్ ప్రకటించింది. ప్రస్తుతానికి గుర్తింపు పొందిన ల్యాబ్‌లో అత్యవసర ప్రాతిపాదికన ఈ ప్రక్రియను ఉపయోగించడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్పింది. వచ్చే వారం నుంచి దీన్ని అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది.
BREAKING: We’re launching a test that can detect COVID-19 in as little as 5 minutes—bringing rapid testing to the frontlines. https://t.co/LqnRpPpqMM pic.twitter.com/W8jyN2az8G
— Abbott (@AbbottNews) March 27, 2020