Telugu Global
CRIME

లాక్‌డౌన్ : లోడు బీర్లు లూటీ

కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అయిన సంగతి తెలిసిందే. తెలంగాణలో గత ఆదివారం నుంచి పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ అమలవుతోంది. అంతకు మునుపే బార్లు, పబ్బులు మూత పడగా.. ఆదివారం నుంచి వైన్స్ కూడా బంద్ చేశారు. దీంతో మందుబాబులకు కష్టాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలోనే లారీ లోడు బీర్లు కనిపించాయి. అంతే వారిలో దురాలోచన పుట్టింది. ఏకంగా లారీ బీర్లను లూటీ చేశారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి […]

లాక్‌డౌన్ : లోడు బీర్లు లూటీ
X

కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అయిన సంగతి తెలిసిందే. తెలంగాణలో గత ఆదివారం నుంచి పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ అమలవుతోంది. అంతకు మునుపే బార్లు, పబ్బులు మూత పడగా.. ఆదివారం నుంచి వైన్స్ కూడా బంద్ చేశారు.

దీంతో మందుబాబులకు కష్టాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలోనే లారీ లోడు బీర్లు కనిపించాయి. అంతే వారిలో దురాలోచన పుట్టింది. ఏకంగా లారీ బీర్లను లూటీ చేశారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది.

తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దేవరయాంజల్ వద్ద ప్రభుత్వ మద్యం డిపో ఉంది. అక్కడికి మల్లేపల్లి లోని బీర్ ఫ్యాక్టరీ నుంచి లోడ్ వేసుకొని లారీ వచ్చింది. లాక్‌డౌన్‌తో లోడ్ దించడానికి వీలు లేకపోవడంతో డిపోలోనే లారీని పెట్టి వెళ్లిపోయారు.

దీన్ని గమనించిన మందుబాబులు.. గోడపక్కన రాళ్లు పెట్టి గోడౌన్‌లోనికి ప్రవేశించారు. లారీపై కప్పిన టార్పలిన్ పట్టా, తాళ్లను కత్తిరించి 120 బీర్ కేసులను ఎత్తుకెళ్లారు. ఉదయాన్నే చూసిన డ్రైవర్ ఈ విషయాన్ని డిపో మేనేజర్ దృష్టికి తీసుకొని వెళ్లాడు. ఆయన వెంటనే పేట్ బషీరాబాద్ పోలీసులకు పిర్యాదు చేశారు.

చోరీ కేసు నమోదు చేసుకున్నపోలీసులు విచారణ చేపట్టారు. లాక్ డౌన్ నేపథ్యంలో వైన్స్ లు, బార్లు మూసివేయడంతో ఇంటి దొంగలే ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.

First Published:  27 March 2020 5:34 AM IST
Next Story