లాక్‌డౌన్ 21 రోజులేనా? మరో రెండు వారాలు పెంచుతారా?
ఏప్రిల్ 14 తర్వాత ఏం జరబోతోంది? 21 రోజుల లాక్‌డౌన్ ఎత్తివేస్తారా? పొడిగిస్తారా? అప్పటి వరకు కరోనా కంట్రోల్‌లోకి వస్తుందా? అసలు దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? కరోనా కంట్రోల్ కాకపోతే ఏం చర్యలు తీసుకుంటారు? అనే దానిపై ఇప్పుడు విస్తృత చర్చలు నడుస్తున్నాయి. ఎప్పటికప్పుడు కేంద్ర ఆరోగ్యశాఖతో పాటు ప్రధానమంత్రి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఇటు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలర్ట్‌గా ఉన్నారు. పరిస్థితిని బట్టి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. చైనా తర్వాత అమెరికా, ఇటలీలో కరోనా విజృంభిస్తోంది. […]
ఏప్రిల్ 14 తర్వాత ఏం జరబోతోంది? 21 రోజుల లాక్‌డౌన్ ఎత్తివేస్తారా? పొడిగిస్తారా? అప్పటి వరకు కరోనా కంట్రోల్‌లోకి వస్తుందా? అసలు దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? కరోనా కంట్రోల్ కాకపోతే ఏం చర్యలు తీసుకుంటారు? అనే దానిపై ఇప్పుడు విస్తృత చర్చలు నడుస్తున్నాయి. ఎప్పటికప్పుడు కేంద్ర ఆరోగ్యశాఖతో పాటు ప్రధానమంత్రి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఇటు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలర్ట్‌గా ఉన్నారు. పరిస్థితిని బట్టి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
చైనా తర్వాత అమెరికా, ఇటలీలో కరోనా విజృంభిస్తోంది. అక్కడ మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వాళ్లు కొంచెం ఆలస్యంగా స్పందించడం వల్లే అక్కడ పరిస్థితి చేయి దాటిపోయింది. ఇది ఊహించిన భారత ప్రభుత్వం… ఇటలీ, అమెరికాలో లాగా పెద్ద ఎత్తున మరణాలు సంభవించకుండా చూడడమే ప్రధాన ఉద్దేశంగా 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించారని తెలుస్తోంది.
21రోజుల లాక్‌డౌన్ ప్రకటించడానికి ప్రధానంగా మూడు కారణాలు చెబుతున్నారు. అందులో మొదటిది…. వైరస్ పెద్ద ఎత్తున ప్రబలితే లక్షల మందికి చికిత్స చేసే మౌలిక వైద్య సదుపాయాలు మన దేశంలో అందుబాటులో లేవు.
ఇక రెండో కారణం చూస్తే…. జనాభా పరంగా చూసినా, భౌగోళికంగా చూసినా మనదేశంలో పరిస్థితులు అదుపు తప్పితే కంట్రోల్ చేయడం సాధ్యం కాదు. ఇటలీలో లోగా పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తే, ఒక్కసారి జనంలో భయం మొదలైతే పరిస్థితులు చేయిదాటిపోతాయి. అందుకోసమే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందే కఠినమైన నిర్ణయాలు ప్రకటించారని తెలుస్తోంది.
ఇక మూడో కారణం… మనదేశంలో వెద్యుల సంఖ్య కూడా తక్కువే. ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు సరిపడా వైద్యులు లేరు. ఇప్పటికే కరోనా బాధితులు పెరిగితే వారికి సరిపడా బెడ్‌లు, వెంటిలేటర్లు లేవని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వైరస్ విజృంభిస్తే కచ్చితంగా సమస్యల్లోకి చిక్కుకుపోవడమే అని గ్రహించిన ప్రధానితో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుగానే లాక్‌డౌన్ ప్రకటించారని సమాచారం.
జనవరి చివరి వారం నుంచి కరోనా ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం మొదలుపెట్టింది. నెల రోజుల ముందే మనదేశంలో లాక్‌డౌన్ ప్రకటిస్తే బాగుండేదని కొంతమంది ఇప్పుడు అంటున్నారు. అయితే నెలరోజుల ముందే లాక్ డౌన్ ప్రకటిస్తే ప్రజల్లో తిరుగుబాటు వచ్చేదని…. కరోనా వైరస్ తీవ్రతను ప్రజలు గ్రహించిన తర్వాతే ప్రభుత్వం చర్యలు ప్రారంభించిదని అధికారులు చెబుతున్నారు.
దేశాన్ని కమ్మేసిన కరోనా వైర్‌స్‌ను అరికట్టేందుకు 21 రోజుల లాక్ డౌన్ సరిపోదని కొందరు నిపుణుల మాట. ఏప్రిల్ 15 తర్వాత మరిన్ని రోజులు లాక్‌డౌన్ ను పొడిగించే అవకాశాలు లేకపోలేదని వీరు అంటున్నారు.
అయితే అప్పటికి కరోనా వైరస్ అరికట్టే విషయంలో మనం ఎంతవరకు విజయం సాధించామనేది తెలుస్తోందని..దాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. ఈ 21 రోజుల్లో కరోనా ఎంత ప్రబలిందో, ఏ మేరకు అరికట్టగలిగామో మాత్రమే తెలుస్తుందని వివరిస్తున్నారు.
ఏప్రిల్ 14 నాటికి పరిస్థితులను బట్టి మరో రెండు వారాలు లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలు కన్పిస్తున్నాయి. చైనాలో రెండు నెలల తర్వాత వ్యూహాన్ పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. అక్కడ ఒక ప్రాంతానికి పరిమితమైంది. కానీ మనదేశంలో అన్ని రాష్ట్రాలకు మెల్లమెల్లగా విస్తరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్ పొడగించే అవకాశాలు ఉన్నాయనేది నిపుణుల మాట.