Telugu Global
International

చైనాని దాటేసిన అమెరికా.... కరోనాతో విలవిల

కరోనా అమెరికాలో కల్లోలం సృష్టిస్తోంది. ఎక్కడ చూసినా భయం కన్పిస్తోంది. అమెరికాలో 85,594 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 1,300 మంది చనిపోయారు. చైనాలో 3,291 మంది, ఇటలీలో ఇప్పటికే 8,215 మంది మృత్యువాత పడ్డారు. పాజిటివ్‌ కేసులు విషయాన్ని చూస్తే చైనా, ఇటలీని అమెరికా దాటేసింది. చైనాలో ఇప్పటివరకూ 81,340 మంది, ఇటలీలో 80,589 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. ఇప్పుడు అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 85 వేలు దాటింది. ఇప్పటివరకూ 5 లక్షల […]

చైనాని దాటేసిన అమెరికా.... కరోనాతో విలవిల
X

కరోనా అమెరికాలో కల్లోలం సృష్టిస్తోంది. ఎక్కడ చూసినా భయం కన్పిస్తోంది. అమెరికాలో 85,594 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 1,300 మంది చనిపోయారు. చైనాలో 3,291 మంది, ఇటలీలో ఇప్పటికే 8,215 మంది మృత్యువాత పడ్డారు.

పాజిటివ్‌ కేసులు విషయాన్ని చూస్తే చైనా, ఇటలీని అమెరికా దాటేసింది. చైనాలో ఇప్పటివరకూ 81,340 మంది, ఇటలీలో 80,589 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. ఇప్పుడు అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 85 వేలు దాటింది. ఇప్పటివరకూ 5 లక్షల 52 వేల మందికి పరీక్షలు నిర్వహించారు.

కరోనా నిర్దారణ పరీక్షలు పెంచడంతో రోజురోజుకు ఈ సంఖ్య పెరిగింది. ప్రతిరోజు భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. న్యూయార్క్‌లో పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఇక్కడ 38 వేల మందికి పైగా వైరస్‌ బారిన పడ్డారు. ఇప్పటికే 281 మంది మరణించారు.

అమెరికాలో 50 రాష్ట్రాల్లో కేసులు ఒక ఎత్తయితే…న్యూయార్క్‌ లో కోవిడ్‌ను కంట్రోల్‌ చేయడం ఒక ఎత్తుగా మారింది. ఇంకా కేసులు పెరిగితే ఆసుపత్రిలో బెడ్‌ల సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతో అమెరికా అధికారుల్లో టెన్షన్‌ పెరుగుతోంది. అయితే చైనా, ఇటలీతో పోలిస్తే మరణాలు సంఖ్య తక్కువగా ఉండడం ఊరట కలిగించే విషయం.

ఇటు ప్రపంచ వ్యాప్తంగా 5 లక్షల 32 వేల 224 కేసులు నమోదు అయ్యాయి. గత 48 గంటల వ్యవధిలో భారీగా పాజిటివ్‌ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకూ మరణాల సంఖ్య 24 వేలు దాటింది.

మనదేశంలో ఇప్పటివరకూ 727 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ఇటలీ తర్వాత స్పెయిన్‌లో 57,786… జర్మనీలో 43,938… ఇరాన్‌లో 29,406… ఫ్రాన్స్‌లో 29,155 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

First Published:  27 March 2020 4:36 AM IST
Next Story