Telugu Global
International

కరోనాతో పోరుకు ఫెదరర్ భారీవిరాళం

మెస్సీ, గార్డియోలా సైతం సాయం ప్రపంచ దేశాలను…ప్రధానంగా యూరోప్ ను కుదిపివేస్తున్న కరోనా వైరస్ ను నిరోధించడానికి ప్రపంచ మేటి క్రీడాకారులు రోజర్ ఫెదరర్, లయనల్ మెస్సీ, పెప్ గార్డియోలా లాంటి మేనేజర్లు…భారీ మొత్తంలో ఆయా ప్రభుత్వాలకు తమవంతుగా సాయం అందిస్తున్నారు. ప్రకృతి అందాలకు చిరునామా స్విట్జర్లాండ్ సైతం ప్రస్తుతం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకొంది. స్విట్జర్లాండ్ లో 9వేల 900 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 122 మంది మరణించారు. కరోనా నివారణ కోసం […]

కరోనాతో పోరుకు ఫెదరర్ భారీవిరాళం
X
  • మెస్సీ, గార్డియోలా సైతం సాయం

ప్రపంచ దేశాలను…ప్రధానంగా యూరోప్ ను కుదిపివేస్తున్న కరోనా వైరస్ ను నిరోధించడానికి ప్రపంచ మేటి క్రీడాకారులు రోజర్ ఫెదరర్, లయనల్ మెస్సీ, పెప్ గార్డియోలా లాంటి మేనేజర్లు…భారీ మొత్తంలో ఆయా ప్రభుత్వాలకు తమవంతుగా సాయం అందిస్తున్నారు.

ప్రకృతి అందాలకు చిరునామా స్విట్జర్లాండ్ సైతం ప్రస్తుతం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకొంది. స్విట్జర్లాండ్ లో 9వేల 900 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 122 మంది మరణించారు. కరోనా నివారణ కోసం స్విట్జర్లాండ్ ప్రభుత్వం సర్వశక్తులూ కేంద్రీకరించి పోరాడుతోంది.

స్విస్ పౌరుడిగా…ప్రభుత్వానికి అండగా నిలవాలని 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విన్నర్ రోజర్ ఫెదరర్ నిర్ణయించాడు. తన భార్య మిర్కాతో కలసి…స్విస్ ప్రభుత్వానికి.. 10 లక్షల స్విస్ ఫ్రాంకులు అందచేశాడు. ఇది అమెరికన్ డాలర్లలో 1.02 మిలియన్లకు సమానం.

మెస్సీ1.08 మిలియన్ డాలర్ల విరాళం..

లాటిన్ అమెరికా దేశం అర్జెంటీనాలో కరోనా కేసులు అంతగా నమోదు కాకపోయినా….బార్సిలోనా కమ్ అర్జెంటీనా సాకర్ సూపర్ స్టార్ లయనల్ మెస్సీ…యూరోప్ దేశాలలో కరోనాతో పోరాటానికి…తనవంతుగా 10 లక్షల 80 వేల డాలర్లు.. మెడికల్ కిట్ల కొనుగోలు కోసం అందచేశాడు.

మాంచెస్టర్ సిటీ క్లబ్ మేనేజర్ పెప్ గార్డియోలా సైతం 10 లక్షల 80 వేల డాలర్లు సాయంగా అందించాడు. పోర్చుగల్ లోని వైద్య కేంద్రాలకు సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో, మేనేజర్ జార్జి మెండెస్ తమవంతుగా భారీమొత్తాన్ని సాయంగా అందించారు.

ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల ఏర్పాటుకు తాము అందించిన మొత్తాన్ని ఉపయోగించాలని రొనాల్డో కోరాడు. పోర్చుగల్ లో 2 వేల 362 మందికి కరోనా సోకగా 30 మంది మృతి చెందారు.

ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాలకు పాకిన కరోనా వైరస్…4 లక్షల 20 వేల 700 మందికి సోకింది. ఇప్పటికే 18వేల 820 మంది మృత్యువాత పడ్డారు.

First Published:  26 March 2020 3:07 AM IST
Next Story