Telugu Global
National

కరోనాపై పోరుకు ‘మేఘా’ ముందడుగు

ప్రపంచాన్ని కబళించేందుకు తరుముకొస్తున్న కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. ఈ క్రమంలో నిషేధాజ్ఞలు విధించాయి. అయితే డబ్బున్న వారికి ఇంట్లో ఉంటే ఓకే. కానీ డబ్బులేని పేదలు, కూలీలు, వ్యవసాయ పనులు చేసేవారి పరిస్థితి ఏంటి? అలాగే కరోనాపై వైద్య సేవలు అందించే వారి బాగోగులు ఎవరు చూడాలి? అందుకే వీరందరి కోసం ప్రముఖ పారిశ్రామిక సంస్థ ‘మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్’ (మెయిల్) ముందుకొచ్చింది. లాక్ డౌన్ తో […]

కరోనాపై పోరుకు ‘మేఘా’ ముందడుగు
X

ప్రపంచాన్ని కబళించేందుకు తరుముకొస్తున్న కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. ఈ క్రమంలో నిషేధాజ్ఞలు విధించాయి. అయితే డబ్బున్న వారికి ఇంట్లో ఉంటే ఓకే. కానీ డబ్బులేని పేదలు, కూలీలు, వ్యవసాయ పనులు చేసేవారి పరిస్థితి ఏంటి? అలాగే కరోనాపై వైద్య సేవలు అందించే వారి బాగోగులు ఎవరు చూడాలి?

అందుకే వీరందరి కోసం ప్రముఖ పారిశ్రామిక సంస్థ ‘మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్’ (మెయిల్) ముందుకొచ్చింది. లాక్ డౌన్ తో పనిలేక ఆకలితో అల్లాడుతున్న పేదలతోపాటు కోవిడ్ మహమ్మారిని తరిమివేయడానికి 24 గంటలు పనిచేస్తున్న పోలీసులకు, ఆరోగ్య సిబ్బందికి, మీడియా వాళ్లకు ఈరోజు రాత్రి నుంచి హైదరాబాద్ లో భోజన సదుపాయం కల్పించడానికి సిద్ధమైంది. అంతేకాకుండా కరోనా వైరస్ బారినపడిన వారికి చేయూతగా మెడిసిన్స్, భోజనం, మెడికల్ ట్రాన్స్ పోర్టేషన్ ఇస్తోంది.

తాజాగా మేఘా సంస్థ ప్రతినిధులు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ను కలిశారు. తయారు చేసిన పౌష్టికరమైన 4వేలకు పైగా ఫుడ్ ప్యాకేట్లను అందజేయనున్నారు. రేపటి నుంచి మూడు పూటలా భోజనం సరఫరా చేస్తారు. క్షేత్ర స్థాయిలో ఇప్పుడు పోలీసులు మాత్రమే ఉండడం.. వారికే ఫోన్ కాల్స్ వస్తుండడంతో ఈ ఫుడ్ ప్యాకేట్లను కూడా మేఘా సంస్థ పోలీస్ శాఖకే అందజేసింది. ఇవి అసహాయులకు, వైద్య సిబ్బందికి పంపిణి చేయాలని కోరింది.

ఇక తెలంగాణతోపాటు, ఏపీలోనూ ఇలా చేయాలని ‘మేఘా’ సిద్ధమైంది. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తోపాటు ఏపీ పోలీసులకు వీటిని అందజేయాలని భావిస్తున్నారు. పోలీసులు ఆహార కొరతతో బాధపడుతున్న వారికి వీటిని అందజేస్తారు.

ఇలా అసహాయులకు, కరోనాపై పోరాడుతున్న వారిని ఆదుకునేందుకు మేఘా ముందుకు రావడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక సేవలో తాముసైతం అని ముందుకొచ్చిన మేఘాను అభినందిస్తున్నారు… ఇంకా ఇలాంటి ఏవైనా ప్రజాప్రయోజన కార్యక్రమాలు, ఐడియాలు ఉంటే అమలు చేయాడానికి మేఘా సిద్ధంగా ఉంది.

First Published:  26 March 2020 11:50 AM IST
Next Story