Telugu Global
National

కశ్మీర్ లో తొలి కరోనా మరణం... దేశంలో 13 మంది మృతి

దేశంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. తాజాగా గురువారం మరో కరోనా మరణం నమోదైంది. జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో తొలి కరోనా మరణం సంభవించింది. జమ్మూకశ్మీర్ లోని హైదర్ పొరా గ్రామంలో 65 ఏళ్ల వ్యక్తి కరోనా వ్యాధితో చికిత్స పొందుతూ మరణించాడు. అతడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో శ్రీనగర్ లోని చాతి సంబంధ వ్యాధుల ఆస్పత్రిలో మూడు రోజుల క్రితం చేర్చారు. పరిస్థితి విషమించి గురువారం చనిపోయాడు. కాగా కరోనాతో మరణించిన వ్యక్తితో నలుగురు […]

కశ్మీర్ లో తొలి కరోనా మరణం... దేశంలో 13 మంది మృతి
X

దేశంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. తాజాగా గురువారం మరో కరోనా మరణం నమోదైంది. జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో తొలి కరోనా మరణం సంభవించింది.

జమ్మూకశ్మీర్ లోని హైదర్ పొరా గ్రామంలో 65 ఏళ్ల వ్యక్తి కరోనా వ్యాధితో చికిత్స పొందుతూ మరణించాడు. అతడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో శ్రీనగర్ లోని చాతి సంబంధ వ్యాధుల ఆస్పత్రిలో మూడు రోజుల క్రితం చేర్చారు. పరిస్థితి విషమించి గురువారం చనిపోయాడు.

కాగా కరోనాతో మరణించిన వ్యక్తితో నలుగురు సన్నిహితంగా మెలిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ నలుగురికి కూడా కరోనా సాకినట్లుగా తెలిసింది. దీంతో జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య ఏకంగా 11కు చేరింది.

ప్రస్తుతం భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 664కు చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 128 కేసులు నమోదయ్యాయి. ఇక రెండో స్థానంలో కేరళ ఉంది. ఆ రాష్ట్రంలో 118 కేసులు నమోదయ్యాయి. మూడో స్థానంలో కర్ణాటక 51, తెలంగాణ 41, గుజరాత్ 38, రాజస్థాన్ 38, ఢిల్లీ 35 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

చైనాకు ఆనుకొని ఉండే ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రత తక్కువగా ఉండడం విశేషం. ఏప్రిల్ 14వరకు దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ వ్యాధి తీవ్రత తగ్గే అవకాశం కనిపిస్తోంది.

First Published:  26 March 2020 8:42 AM IST
Next Story