Telugu Global
NEWS

క్రీడలంటే భారత యువతకు అంతంత మాత్రమే ఆసక్తి

క్రీడల్లో భారత మహిళల పట్ల కొనసాగుతున్న వివక్ష ప్రపంచంలోనే అత్యంత యువజన జనాభా కలిగిన దేశం భారత్. అయితే…యువజనుల్లో ఎక్కువమంది క్రీడలపట్ల మక్కువ ప్రదర్శించడం లేదన్న వాస్తవం… దేశవ్యాప్తంగా 14 ప్రధాన రాష్ట్ర్రాలలో నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. మొత్తం 10 వేల 181 మంది పురుషులు, మహిళలు, యువతీయువకులు ఈ సర్వేలో పాలుపంచుకొన్నారు. దేశయువజన జనాభాలోని 64 శాతం మంది క్రీడలకు దూరంగా ఉంటున్నట్లు, ఆటలంటే తమకు ఏమాత్రం ఆసక్తిలేనట్లు అధ్యయనంలో వెల్లడించారు. మహిళల్లో 29 శాతం మంది, […]

క్రీడలంటే భారత యువతకు అంతంత మాత్రమే ఆసక్తి
X
  • క్రీడల్లో భారత మహిళల పట్ల కొనసాగుతున్న వివక్ష

ప్రపంచంలోనే అత్యంత యువజన జనాభా కలిగిన దేశం భారత్. అయితే…యువజనుల్లో ఎక్కువమంది క్రీడలపట్ల మక్కువ ప్రదర్శించడం లేదన్న వాస్తవం… దేశవ్యాప్తంగా 14 ప్రధాన రాష్ట్ర్రాలలో నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. మొత్తం 10 వేల 181 మంది పురుషులు, మహిళలు, యువతీయువకులు ఈ సర్వేలో పాలుపంచుకొన్నారు.

దేశయువజన జనాభాలోని 64 శాతం మంది క్రీడలకు దూరంగా ఉంటున్నట్లు, ఆటలంటే తమకు ఏమాత్రం ఆసక్తిలేనట్లు అధ్యయనంలో వెల్లడించారు.

మహిళల్లో 29 శాతం మంది, పురుషుల్లో 42 శాతం మంది మాత్రమే క్రీడల్లో పాల్గొంటున్నారు. 15 నుంచి 24 సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారే క్రీడల పట్ల ఆసక్తి చూపడం, ఏదో ఒక క్రీడలో పాల్గొన్నట్లు తేలింది.

పశ్చిమ భారత్ లోని మహారాష్ట్ర్రలో అత్యధికంగా 53 శాతం మంది, దక్షిణ భారత రాష్ట్ర్రాలలో తమిళనాడుకు చెందిన 54 శాతం మంది యువజన జనాభా క్రీడలంటే ఆసక్తి చూపుతున్నారు.

ఉత్తరభారత రాష్ట్ర్రాలలోని పంజాబ్, హర్యానా జనాభాలో కేవలం 15 శాతం మంది మాత్రమే క్రీడల్లో పాల్గొంటున్నట్లు సర్వే తెలిపింది.

మహిళల ఆటలు బోర్… బోర్

పురుషులతో పోల్చి చూస్తే మహిళల ఆటలు అంత ఆసక్తికరంగా ఉండవని సర్వేలో పాలుపంచుకొన్న ఎక్కువమంది చెప్పడం విశేషం. అంతేకాదు..అధ్యయనంలో పాల్గొన్న మహిళల్లో 50 శాతం మంది..తమకు నచ్చిన ఒక్క క్రీడాకారుడు లేదా క్ర్రీడాకారిణి పేరు చెప్పలేకపోయారు.

ఆరేళ్ల క్రితం రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ టెండుల్కర్‌ మాత్రమే తమకు నచ్చిన ప్లేయర్ అంటూ సర్వేలో పాల్గొన్న ఎక్కువమంది పేర్కొనడం మరీ విశేషం.

సానియా మీర్జా గురించి తమకు తెలుసునని 18 శాతం మంది మాత్రమే తెలిపారు. విశ్వవిఖ్యాత భారత మహిళా అథ్లెట్లలో పీటీ ఉష, పీవి సింధు, సైనా నెహ్వాల్ లకు అత్యధిక జనాదరణ కలిగిన మొదటి ముగ్గురి స్థానాలు దక్కాయి.

క్రీడల్లో ప్రముఖులుగా ఉన్న మహిళల కంటే పురుషుల పేర్లనే 83 శాతం మంది గుర్తించడం విశేషం.

క్రికెట్ దే అగ్రస్థానం….

భారత యువకులు ఎక్కువగా ఆడుతున్న క్రీడల్లో క్రికెట్ , ఫుట్ బాల్, వాలీబాల్, పరుగు, సైక్లింగ్ అంశాలు ఉన్నాయి. యువకులతో పోల్చిచూస్తే యువతులు మాత్రం ఎంపిక చేసిన కొన్ని క్రీడలకు మాత్రమే పరిమితమైపోతున్నారు.

తమకు నచ్చిన క్రీడల్లో యువకులంత స్వేచ్ఛగా యువతులు పాల్గొనలేకపోతున్నారు. దీనికి సామాజిక పరిస్థితులు, కట్టుబాట్లు, పురుష, మహిళ అన్న తేడా ప్రస్ఫుటంగా కనపిస్తోంది.

కుస్తీ, బాక్సింగ్, కబడ్డీ, వెయిట్ లిఫ్టింగ్ లాంటి క్రీడలు భారత మహిళలకు ఏమాత్రం సరిపడవని, కొన్ని రాష్ట్ర్రాలకు చెందిన మహిళలు మాత్రమే ఈ నాలుగురకాల క్రీడల పట్ల ఆసక్తి చూపుతున్నట్లు సర్వేలో తేలింది.

తమకు అంతగా నప్పని బాక్సింగ్, కుస్తీ, వెయిట్ లిఫ్టింగ్ లాంటి క్రీడాంశాలలోనే పురుషుల కంటే మహిళలే సమర్థవంతంగా రాణించడం, అత్యధికంగా పతకాలు సాధించి పెట్టినట్లు తేలింది.

మొత్తం మీద…భారత క్రీడారంగంలో ఇప్పటికీ మహిళల పట్ల ఏదో ఒక రూపంలో వివక్ష కొనసాగుతూనే ఉందని, మహిళలు స్వేచ్ఛగా తమకు నచ్చిన క్రీడలో పాల్గొనే అవకాశం లేనేలేదని బీబీసీ సర్వే చెప్పకనే చెప్పింది.

First Published:  25 March 2020 6:26 AM IST
Next Story