Telugu Global
National

ఐపీఎల్ -13 పీకమీద లాక్ డౌన్ కత్తి

21రోజుల లాక్ డౌన్ తో రద్దయ్యే అవకాశం భారత క్రికెట్ అభిమానుల వేసవివినోదం ఐపీఎల్ 13వ సీజన్ పోటీలు సైతం రద్దులపద్దులో చేరటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రపంచ దేశాలతో పాటు భారత్ ను సైతం కరోనా వైరస్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విదేశాల నుంచి భారత్ కు వచ్చినవారి నుంచి సంక్రమించిన కరోనా వైరస్ దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన 500 మందికి సోకగా 11మంది మృతి చెందిన నేపథ్యంలో…దేశంలోని అన్నిరకాల క్రీడాకార్యక్రమాలను నిలిపివేశారు. దీనికితోడు…ప్రధానని నరేంద్ర మోడీ తాజాగా 21 […]

ఐపీఎల్ -13 పీకమీద లాక్ డౌన్ కత్తి
X
  • 21రోజుల లాక్ డౌన్ తో రద్దయ్యే అవకాశం

భారత క్రికెట్ అభిమానుల వేసవివినోదం ఐపీఎల్ 13వ సీజన్ పోటీలు సైతం రద్దులపద్దులో చేరటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రపంచ దేశాలతో పాటు భారత్ ను సైతం కరోనా వైరస్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

విదేశాల నుంచి భారత్ కు వచ్చినవారి నుంచి సంక్రమించిన కరోనా వైరస్ దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన 500 మందికి సోకగా 11మంది మృతి చెందిన నేపథ్యంలో…దేశంలోని అన్నిరకాల క్రీడాకార్యక్రమాలను నిలిపివేశారు.

దీనికితోడు…ప్రధానని నరేంద్ర మోడీ తాజాగా 21 రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ ను ప్రకటించడంతో…ఏప్రిల్ 15 వరకూ వాయిదా పడిన ఐపీఎల్ ను పూర్తిగా రద్దు చేయకతప్పని పరిస్థితి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మార్చి 29న ముంబైలో ప్రారంభంకావాల్సిన ఈటోర్నీని కరోనా వైరస్ ముప్పుతో ఏప్రిల్ 15 నాటికి వాయిదా వేసినా…గత పదిరోజుల్లో వచ్చిన తేడా, మార్పు ఏవీ లేవని బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ చెబుతున్నారు.

ఫ్రాంచైజీ యజమానులంతా కలసి త్వరలోనే ఐపీఎల్ పాలకమండలితో చర్చించడం ద్వారా తుదినిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఐపీఎల్ కు బీమా రక్షణ ఉన్నా…ప్రభుత్వమే లాక్ డౌన్ ప్రకటించిన కారణంగా నష్టపరిహారం పొందే అవకాశం ఏమాత్రం లేదని చెప్పారు.

భారత ప్రధాని ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ కు తాము సంపూర్ణమద్దతు ప్రకటిస్తున్నామని, కరోనా వైరస్ ను స్వీయరక్షణతో మాత్రమే నిరోధించగలమన్న వాస్తవాన్ని అందరూ గుర్తించాలని సౌరవ్ గంగూలీ కోరారు.

టోక్యో ఒలింపిక్స్, యూరోపియన్ కప్ ఫుట్ బాల్, కోపా అమెరికన్ ఫుట్ బాల్, అంతర్జాతీయ టెన్నిస్ పోటీలు, ఇతర ప్రధాన టోర్నీలన్నీ ఇప్పటికే రద్దు కావడంతో… ఐపీఎల్ హంగామా సైతం రద్దుకాక తప్పదని భావిస్తున్నారు.

First Published:  25 March 2020 4:30 AM IST
Next Story