Telugu Global
International

ఇండియా లాక్‌డౌన్

అర్థరాత్రి 12 నుంచి అన్నీ బంద్ కరోనా కట్టడే లక్ష్యం దేశ ప్రజలు సహకరించాలి ప్రధాని మోడీ కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తే వెనుకాడేదే లేదని ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూ కంటే ముందే హెచ్చరించారు. దేశంలో పలు రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించినా ప్రజలు నిర్లక్ష్యం చేస్తుండటంతో.. ఇప్పుడు ఏకంగా ప్రధాని రంగంలోనిక దిగారు. మంగళవారం అర్థరాత్రి 12 గంటల (తెల్లారితే బుధవారం) నుంచి దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ […]

ఇండియా లాక్‌డౌన్
X
  • అర్థరాత్రి 12 నుంచి అన్నీ బంద్
  • కరోనా కట్టడే లక్ష్యం
  • దేశ ప్రజలు సహకరించాలి
  • ప్రధాని మోడీ

కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తే వెనుకాడేదే లేదని ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూ కంటే ముందే హెచ్చరించారు. దేశంలో పలు రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించినా ప్రజలు నిర్లక్ష్యం చేస్తుండటంతో.. ఇప్పుడు ఏకంగా ప్రధాని రంగంలోనిక దిగారు.

మంగళవారం అర్థరాత్రి 12 గంటల (తెల్లారితే బుధవారం) నుంచి దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు లాక్‌డౌన్ నిబంధనలు అమలులోనికి వచ్చాయి. కరోనా భయాందోళనల నేపథ్యంలో ప్రధాని మోడీ మంగళవారం రాత్రి 8.00 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించారు.

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబలిస్తోందని.. చాలా వేగంగా వ్యాపిస్తున్న ఈ వైరస్‌ను కట్టడి చేయాలంటే ప్రజలందరూ ఇండ్లకే పరిమితం కావడం.. సామాజిక దూరం పాటించడమే సరైన మార్గమన్నారు. అలా ఉంటేనే తప్ప వైరస్ గండం నుంచి గట్టెక్కలేమన్నారు. ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ మహమ్మారి బారిన పడి నిస్సహాయ స్థితిలో ఉన్నాయని ప్రధాని మోడీ తెలిపారు. కరోనా నుంచి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది సవాలు విసురుతూనే ఉంది. ప్రతీ రోజు వార్తలో అది ఎంత వేగంతో విస్తరిస్తోందో చూస్తూనే ఉన్నామని మోడీ అన్నారు.

కరోనా కట్టడి కోసం ఇవ్వాల్టి నుంచి 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటిస్తున్నామని.. ప్రజలు ఇళ్లు విడిచి బయటకు రావడంపై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. దేశంలోని ప్రతీ నగరం, పట్టణం, గ్రామం లాక్‌డౌన్‌లో ఉంటుందని ఆయన అన్నారు. లాక్‌డౌన్ ఇప్పుడు అమలు చేయకపోతే దేశం మరో 21 ఏండ్లు వెనుకకు వెళ్లిపోతుందని ప్రధాని హెచ్చరించారు. దీని వల్ల కొన్ని కుటుంబాలు నష్టపోవచ్చేమో కాని దేశ భవిష్యత్ దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పట్లేదని ప్రధాని చెప్పారు. ఈ లాక్‌డౌన్ ప్రతీ ఇంటి ముందు గీసిన లక్ష్మణ రేఖ అని ఆయన చెప్పారు.

కరోనా వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేస్తోంది. తొలి లక్ష మందికి కరోనా వ్యాపించడానికి 67 రోజులు పట్టింది. లక్ష నుంచి రెండు లక్షలకు చేరడానికి 11 రోజులు పడితే రెండు నుంచి మూడు లక్షలకు చేరడానికి కేవలం 4 రోజులే సమయం పట్టిందంటే.. కరోనా ఎంత వేగంగా వ్యాపిస్తుందో అర్థం చేసుకోవచ్చని ప్రధాని తెలిపారు. సామాజిక దూరం పాటించడంతోనే కరోనాను కట్టడి చేయగలమని ప్రధాని తెలిపారు.

వైద్య సేవలను తక్షణం మెరుగుపరచడానికి 15వేల కోట్లు కేటాయించాము. ప్రైవేటు సంస్థలు కూడా తమ తోడ్పాటునందిస్తున్నట్లు ప్రధాని చెప్పారు. చికిత్స కంటే నివారణే మంచిది కనుక కరోనా కట్టడికి ఈ 21 రోజలు ఇండ్లల్లో ఉంటే వైరస్ చెయిన్‌ను తెగగొట్టవచ్చని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

First Published:  25 March 2020 2:03 AM IST
Next Story