మెగాస్టార్ ఉగాది కానుక
ఈ ఉగాదికి చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య ఫస్ట్ లుక్ వస్తుందని అంతా వెయిట్ చేశారు. కానీ అది రాలేదు. అయితే అంతకంటే స్పెషల్ సర్ ప్రైజ్ ఒకటి వచ్చింది. అదే మెగాస్టార్ సోషల్ మీడియా ఎంట్రీ. అవును.. ఉగాది సందర్భంగా సోషల్ మీడియాలోకి ఎంటరయ్యారు చిరంజీవి. ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు చెబుతూనే, కరోనా టైమ్స్ లో కాస్త జాగ్రత్తగా ఉండాలని, ఇంటి పట్టునే ఉండాలని విజ్ఞప్తి చేశారు చిరంజీవి. చిరంజీవి సోషల్ మీడియాలోకి రావడంతో టాలీవుడ్ […]

ఈ ఉగాదికి చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య ఫస్ట్ లుక్ వస్తుందని అంతా వెయిట్ చేశారు. కానీ అది రాలేదు. అయితే అంతకంటే స్పెషల్ సర్ ప్రైజ్ ఒకటి వచ్చింది. అదే మెగాస్టార్ సోషల్ మీడియా ఎంట్రీ. అవును.. ఉగాది సందర్భంగా సోషల్ మీడియాలోకి ఎంటరయ్యారు చిరంజీవి.
ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు చెబుతూనే, కరోనా టైమ్స్ లో కాస్త జాగ్రత్తగా ఉండాలని, ఇంటి పట్టునే ఉండాలని విజ్ఞప్తి చేశారు చిరంజీవి. చిరంజీవి సోషల్ మీడియాలోకి రావడంతో టాలీవుడ్ మొత్తం కదిలింది. హీరోహీరోయిన్లంతా చిరంజీవి చేసిన మొట్టమొదటి ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ, అతడికి సోషల్ మీడియాలోకి సాదరంగా ఆహ్వానించింది.
అంతా బాగానే ఉంది కానీ చిరంజీవి లాంటి వ్యక్తి సోషల్ మీడియా ట్రోలింగ్స్ ను ఎలా ఎదుర్కొంటారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఎందుకంటే సోషల్ మీడియాలో ఏ స్టార్ పై ఎప్పుడు-ఎలా ట్రోలింగ్ మొదలవుతుందో ఎవ్వరూ చెప్పలేం. ఏదో ఊహించి ట్వీట్ చేస్తే, అది ఇంకోలా టర్న్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ విషయంలో చిరంజీవి తన ఇమేజ్ కు భంగం వాటిల్లకుండా సోషల్ మీడియాను ఎలా ఉపయోగిస్తారో చూడాలి.
#HappySarvariUgadi
DELIGHTED to directly engage with my beloved fellow Indians,Telugus & my dearest fans through a platform like this.This #NewYear’s Day,let’s resolve to defeat this global health crisis with awareness & responsibility. #UnitedAgainstCorona #StayHomeStaySafe pic.twitter.com/Fb3Cnw4nHH— Chiranjeevi Konidela (@KChiruTweets) March 25, 2020