రాజ్యసభ ఎన్నికలు వాయిదా
దేశంలో కరోనా వైరస్ నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యసభ ఎన్నికల పోలింగ్ వాయిదా వేసింది. పోలింగ్ తేదీలను తర్వాత ప్రకటిస్తామని చెప్పింది. పది రాష్ట్రాల్లో 37 సీట్లు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 18 సీట్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మిగిలిన సీట్లకు దాఖలైన నామినేషన్లు అన్ని వాలిడ్ గా ఉంటాయి. తదుపరి తాజా పోలింగ్ కౌంటింగ్ డేట్ ను ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కరోణ […]
దేశంలో కరోనా వైరస్ నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యసభ ఎన్నికల పోలింగ్ వాయిదా వేసింది. పోలింగ్ తేదీలను తర్వాత ప్రకటిస్తామని చెప్పింది.
పది రాష్ట్రాల్లో 37 సీట్లు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 18 సీట్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మిగిలిన సీట్లకు దాఖలైన నామినేషన్లు అన్ని వాలిడ్ గా ఉంటాయి. తదుపరి తాజా పోలింగ్ కౌంటింగ్ డేట్ ను ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
కరోణ వైరస్ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ సహా అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఎయిర్ లైన్స్, రైలు సేవలు నిలిచిపోయాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సైతం దీన్ని ప్రపంచ అంటువ్యాధిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
ఇప్పటివరకు జరిగిపోయిన ప్రక్రియ అలాగే కొనసాగుతుందని స్పష్టం చేసింది. కరోనా వైరస్ తదుపరి పరిస్థితిని సమీక్షించిన అనంతరం తేదీలు ప్రకటిస్తామని ఈసీ తెలిపింది.
తెలంగాణ రెండు రాజ్యసభ స్థానాలకు టీఆర్‌ఎస్ నుంచి కేశవరావు, కేఆర్ సురేష్ రెడ్డి నామినేషన్‌లు వేశారు. వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. వారికి ఏకగ్రీవ పత్రాలు కూడా అందజేశారు.
ఇటు ఏపీలో నాలుగు స్థానాలకు ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. వైసీపీ నుంచి అయోధ్యరామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ మోత్వాని నామినేషన్ వేశారు. టీడీపీ నుంచి వర్ల రామయ్య కూడా పోటీలో ఉన్నారు. దీంతో ఇక్కడ ఎన్నిక అనివార్యంగా మారింది. తదుపరి తేదీలు వచ్చిన తర్వాత ఎన్నికలు జరగబోతున్నాయి.