కరోనా ఎఫెక్ట్ " క్యాంప్ ఎత్తేసిన టీఆర్‌ఎస్
కరోనా ఎఫెక్ట్ రాజకీయాలపై పడింది. ఇప్పటికే పొలిటికల్ లీడర్లు గడప దాటడం లేదు. సభలు, సమావేశాలు ఆపేశారు. అత్యవసరమైతే తప్ప మీటింగ్‌లకు హాజరుకావడం లేదు. రాజకీయ నేతలు అందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ముఖ్యంగా మెయిన్ లీడర్లు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఏదైనా పని ఉంటే ఫోన్ లలోనే కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. చాలా మంది నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూడడం లేదు. ఇప్పుడు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ తరపున కవిత, కాంగ్రెస్, బీజేపీ తరపున […]
కరోనా ఎఫెక్ట్ రాజకీయాలపై పడింది. ఇప్పటికే పొలిటికల్ లీడర్లు గడప దాటడం లేదు. సభలు, సమావేశాలు ఆపేశారు. అత్యవసరమైతే తప్ప మీటింగ్‌లకు హాజరుకావడం లేదు.
రాజకీయ నేతలు అందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ముఖ్యంగా మెయిన్ లీడర్లు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఏదైనా పని ఉంటే ఫోన్ లలోనే కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. చాలా మంది నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూడడం లేదు.
ఇప్పుడు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ తరపున కవిత, కాంగ్రెస్, బీజేపీ తరపున అభ్యర్థులు నామినేషన్లు వేశారు. టీఆర్‌ఎస్ నేతలు ఇప్పటికే స్థానిక సంస్థల నేతలను క్యాంప్‌కు తరలించారు. అయితే క్యాంపులో కరోనా కలకలం రేగింది. ఇద్దరు ప్రజా ప్రతినిధులకు కరోనా లక్షణాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది.
దీంతో అప్రమత్తమైన అధిష్టానం క్యాంపు ఎత్తేసింది. రిస్టార్ట్ నుంచి నేతలను ఇంటికి పంపించింది. కరోనా ఎఫెక్ట్ తో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.