Telugu Global
NEWS

బాబుకు దూరంగా టీడీపీ సీనియర్లు.... ఏం జరుగుతోంది?

గంటా శ్రీనివాసరావు, అశోక్ గజపతి రాజు, మాగంటి బాబు… ఇలా ఎంతో దిగ్గజ టీడీపీ సీనియర్లు చంద్రబాబుకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా టీడీపీలో కీలకంగా వ్యవహరించిన మాగంటి బాబు వైసీపీ ప్రభుత్వం వచ్చాక క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. పశ్చిమ గోదావరి కి చెందిన ఈ బలమైన రాజకీయ నాయకుడు, చిత్ర నిర్మాత అకస్మాత్తుగా టీడీపీ రాజకీయాలను పూర్తిగా పక్కనపెట్టాడు. టిడిపి కార్యక్రమాలకు ఆయన హాజరుకావడం లేదు. మాగంటి తన నివాసానికి మాత్రమే పరిమితం అయ్యాడు. ఇటీవలి కాలంలో […]

బాబుకు దూరంగా టీడీపీ సీనియర్లు.... ఏం జరుగుతోంది?
X

గంటా శ్రీనివాసరావు, అశోక్ గజపతి రాజు, మాగంటి బాబు… ఇలా ఎంతో దిగ్గజ టీడీపీ సీనియర్లు చంద్రబాబుకు దూరంగా ఉంటున్నారు.

ముఖ్యంగా టీడీపీలో కీలకంగా వ్యవహరించిన మాగంటి బాబు వైసీపీ ప్రభుత్వం వచ్చాక క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. పశ్చిమ గోదావరి కి చెందిన ఈ బలమైన రాజకీయ నాయకుడు, చిత్ర నిర్మాత అకస్మాత్తుగా టీడీపీ రాజకీయాలను పూర్తిగా పక్కనపెట్టాడు. టిడిపి కార్యక్రమాలకు ఆయన హాజరుకావడం లేదు. మాగంటి తన నివాసానికి మాత్రమే పరిమితం అయ్యాడు. ఇటీవలి కాలంలో పార్టీ కార్యకర్తలను కూడా కలవలేదు.

అధికార వైసీపీకి వ్యతిరేకంగా టిడిపి నిరసనలు, ఇతర కార్యక్రమాలను నిర్వహించడంలో టీడీపీ అధినేత చంద్రబాబు బిజీగా ఉన్నాడు. అయితే ఈ కార్యక్రమాలకు పిలుపునిచ్చినా కూడా మాగంటి బాబు ఏ కార్యక్రమాలలోనూ కనిపించలేదు. పోనీ ఈయన తన కొడుకులను సైతం రాజకీయాల్లో ప్రోత్సహించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో సీనియర్లు తప్పుకొని తమ వారసులకు పగ్గాలు ఇచ్చారు. జేసీ, పరిటాల కుటుంబాల్లో కుమారులు బయటకొచ్చారు. ఇతర సీనియర్ టీడీపీ రాజకీయ నాయకుల మాదిరిగా కాకుండా మగంటి బాబు కూడా తన కుమారుడు రామ్ జీని రాజకీయాల్లో అస్సలు ప్రోత్స హించడం లేదు. రామ్ జీ ఎప్పుడో టిడిపిలో చేరాడు. కానీ అంతగా చురుకుగా లేడు.

చంద్రబాబు నాయుడు కబురు పంపినా మాగంటి యాక్టివ్ కావడం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీకి గుడ్ బై చెప్పి వేరే ఏపార్టీలోకి కూడా వెళ్లడం లేదు.

ప్రస్తుతానికి మాగంటి బాబు టిడిపిని విడిచిపెట్టే ప్రణాళిక లేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. కానీ మాగంటి బాబు మౌనం మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో టిడిపిని చాలా బలహీనం చేస్తోంది.

First Published:  24 March 2020 2:05 AM IST
Next Story