Telugu Global
National

ఈసారి వర్మకు బాగానే మద్దతు

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ట్వీట్ వేశాడంటే దానికి ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వస్తుంటాయి. వర్మ ట్వీట్లపై బూతులతో విరుచుకుపడే బ్యాచ్ కూడా ఉంది. అలాంటి వర్మ నుంచి సమాజానికి పనికొచ్చేదిగా, కాస్త మంచి విషయం అనిపించే ట్వీట్ ఒకటి వచ్చింది. దీంతో చాన్నాళ్ల తర్వాత వర్మ వేసిన ఓ ట్వీట్ కు జనాల నుంచి మంచి స్పందన, మద్దతు వచ్చింది. అందుకే ఇదొక విశేషమైంది. జనతా కర్ఫ్యూను దేశమంతా గొప్పగా పాటించింది. […]

ఈసారి వర్మకు బాగానే మద్దతు
X

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ట్వీట్ వేశాడంటే దానికి ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వస్తుంటాయి. వర్మ ట్వీట్లపై బూతులతో విరుచుకుపడే బ్యాచ్ కూడా ఉంది. అలాంటి వర్మ నుంచి సమాజానికి పనికొచ్చేదిగా, కాస్త మంచి విషయం అనిపించే ట్వీట్ ఒకటి వచ్చింది. దీంతో చాన్నాళ్ల తర్వాత వర్మ వేసిన ఓ ట్వీట్ కు జనాల నుంచి మంచి స్పందన, మద్దతు వచ్చింది. అందుకే ఇదొక విశేషమైంది.

జనతా కర్ఫ్యూను దేశమంతా గొప్పగా పాటించింది. నిన్నంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సాయంత్రం 5 అయ్యేసరికి, మోడీ చెప్పినట్టు అంతా బయటకొచ్చి చప్పట్లు కొట్టారు. ఇక్కడితో ఆగితే మనం భారతీయులం ఎందుకవుతాం. కొంతమంది అత్యుత్సాహంతో బయటకొచ్చి సంబరాలు చేసుకున్నారు. బైకులు, కార్లు బయటకు తీసి ర్యాలీలు తీశారు. ఏదో విజయం సాధించినట్టు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకొని, ఆలింగనాలు చేసుకున్నారు. తద్వారా వైరస్ వ్యాప్తిని మరింత పెంచారన్నమాట.

దీనిపై వర్మ సెటైరిక్ గా స్పందించాడు. సాయంత్రం 5వరకు నిష్టగా కర్ఫ్యూ పాటించిన జనాలంతా.. 5 తర్వాత పూర్తిగా అన్నీ మరిచిపోయారని ఎద్దేవా చేశాడు. దీనికి నెటిజన్ల నుంచి మంచి మద్దతు వస్తోంది. చాన్నాళ్ల తర్వాత మంచి ట్వీట్ వేశావంటూ వర్మను చాలామంది మెచ్చుకున్నారు.

రోజూ ఇలా మంచిగా ట్వీట్స్ చేస్తే నీ సొమ్మేం పోతుంది బాస్ అంటూ మరికొందరు పరోక్షంగా మెచ్చుకున్నారు. మొత్తమ్మీద ఒక్క ట్వీట్ తో వర్మ బాగానే మైలేజీ సంపాదించుకున్నాడు.

First Published:  23 March 2020 6:48 AM GMT
Next Story