Telugu Global
National

లాక్‌డౌన్‌పై నిర్లక్ష్యం వద్దు " ప్రధాని మోడీ

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్ పట్ల ప్రజలు నిర్లక్ష్యం వహించరాదని ప్రధాని మోడీ అన్నారు. కరోనాను కట్టడి చేయడానికి తెలంగాణ, ఏపీ, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ప్రకటించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొన్ని జిల్లాలలో లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. లాక్‌డౌన్‌ను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని.. ప్రజలందరూ విధిగా లాక్‌డౌన్ నియమాలను పాటించాలని ఆయన కోరారు. మనల్ని మనం రక్షించుకోవడానికి లాక్‌డౌన్ విధించామని […]

లాక్‌డౌన్‌పై నిర్లక్ష్యం వద్దు  ప్రధాని మోడీ
X

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్ పట్ల ప్రజలు నిర్లక్ష్యం వహించరాదని ప్రధాని మోడీ అన్నారు. కరోనాను కట్టడి చేయడానికి తెలంగాణ, ఏపీ, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ప్రకటించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొన్ని జిల్లాలలో లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

లాక్‌డౌన్‌ను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని.. ప్రజలందరూ విధిగా లాక్‌డౌన్ నియమాలను పాటించాలని ఆయన కోరారు. మనల్ని మనం రక్షించుకోవడానికి లాక్‌డౌన్ విధించామని గుర్తించాలని.. ప్రతీ ఒక్కరు సామాజిక దూరాన్ని పాటించాలని ఆయన ట్విట్టర్‌లో కోరారు.

లాక్‌డౌన్‌ను ప్రతీ రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా అమలు చేయాలని ఆయన చెప్పారు. నిర్లక్ష్యం చేస్తే ముప్పు పెరుగుతుందనే విషయం తెలుసుకోవాలన్నారు. ఇటలీ, ఇరాన్, స్పెయిన్ దేశాల అనుభవాలను మరవొద్దని.. మూడు దేశాల్లో కరోనా కారణంగా జరుగుతున్న భారీ నష్టాన్ని చూసి కళ్లు తెరవాలని ఆయన అన్నారు.

ప్రతీ పౌరుడూ లాక్‌డౌన్‌ను తమ బాధ్యతగా గుర్తించి మసులుకోవాలని ప్రధాని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

First Published:  23 March 2020 5:57 AM IST
Next Story