లాక్ డౌన్ లో దర్శకురాలి చిట్కాలు...
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ నడుస్తోంది. ఈనెల 31 వరకు అంటే మరో వారం రోజుల పాటు అంతా ఇళ్లలోనే ఉండాలి. బయట తిరగకూడదు. షాపింగ్స్ మాల్స్, థియేటర్లు, రవాణా వ్యవస్థ అన్నీ బంద్ అన్నమాట. మరోవైపు కూరగాయల్లాంటి నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. మరి ఇలాంటి టైమ్ లో బతకడం ఎలా. దీనికి చక్కటి చిట్కా చెబుతోంది దర్శకురాలు నందినీరెడ్డి. లాక్ డౌన్ టైమ్ లో తక్కువ వనరులతో ఎక్కువగా, గొప్పగా బతకాలంటే ఒక పూట […]
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ నడుస్తోంది. ఈనెల 31 వరకు అంటే మరో వారం రోజుల పాటు అంతా ఇళ్లలోనే ఉండాలి. బయట తిరగకూడదు. షాపింగ్స్ మాల్స్, థియేటర్లు, రవాణా వ్యవస్థ అన్నీ బంద్ అన్నమాట. మరోవైపు కూరగాయల్లాంటి నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. మరి ఇలాంటి టైమ్ లో బతకడం ఎలా. దీనికి చక్కటి చిట్కా చెబుతోంది దర్శకురాలు నందినీరెడ్డి.
లాక్ డౌన్ టైమ్ లో తక్కువ వనరులతో ఎక్కువగా, గొప్పగా బతకాలంటే ఒక పూట తినడమే బెటర్ అంటోంది ఈ దర్శకురాలు. పైగా అలా చేయడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని చెబుతోంది. నందినీరెడ్డి చెప్పిన చిట్కాకు సోషల్ మీడియాలో మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇలా చేయడం వల్ల అన్ని రకాలుగా ఆదా అవుతుందని, సమాజానికి తద్వారా దేశానికి కూడా మంచిదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఒక పూట తిని బతకగలమా అనే సందేహాన్ని సోషల్ మీడియాలో చాలామంది వ్యక్తం చేశారు. దీనికి కూడా నందినీరెడ్డి సమాధానం ఇచ్చారు. ఉపవాసం అంటే ఇదేనంటోంది. తినడం మాత్రమే ఒక పూట చేయాలని, మిగతా రెండు పూటలు ఎంచక్కా పళ్ల రసాలు, వేడి నీళ్లు తాగొచ్చని చెబుతున్నారు. లాక్ డౌన్ కోసం కాకపోయినా.. ఆరోగ్యానికి నందినీరెడ్డి చెప్పిన సూచన ఎంతో మేలు చేస్తుంది. అందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహాల్లేవు.