Telugu Global
National

బెజవాడలో తొలి కరోనా కేసు " ఏపీలో అలర్ట్‌

ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. బెజవాడలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. విజయవాడ వన్‌ టౌన్‌ ఏరియాలో ఉండే ఓ యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో ఉన్నాడు. కానీ ఈ టెస్ట్  కు ముందు మూడు రోజులు అతడు ఇంటి దగ్గరే ఉన్నాడు. ఇదే వన్‌టౌన్‌ ఏరియాలో జనాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకూ అధికారులు 160 మంది శాంపిల్స్ పరిశీలించారు. వారిలో 130 మందికి నెగటివ్‌ వచ్చింది. […]

బెజవాడలో తొలి కరోనా కేసు  ఏపీలో అలర్ట్‌
X

ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. బెజవాడలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది.

విజయవాడ వన్‌ టౌన్‌ ఏరియాలో ఉండే ఓ యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో ఉన్నాడు. కానీ ఈ టెస్ట్ కు ముందు మూడు రోజులు అతడు ఇంటి దగ్గరే ఉన్నాడు. ఇదే వన్‌టౌన్‌ ఏరియాలో జనాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

ఇప్పటివరకూ అధికారులు 160 మంది శాంపిల్స్ పరిశీలించారు. వారిలో 130 మందికి నెగటివ్‌ వచ్చింది. విదేశాల నుంచి వచ్చిన విజయవాడ వన్‌టౌన్‌ యువకుడికి పాజిటివ్‌ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ప్యారిస్‌ నుంచి వచ్చిన ఈ యువకుడు ఈనెల 17,18న ఇంట్లోనే ఉన్నాడు. జ్వరం రావడంతో 18న ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతనికి కరోనా వైరస్‌ ఉన్నట్లు నిన్న నిర్దారణ అయింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.

విజయవాడ వన్‌టౌన్‌లో యువకుడు ఉన్న ప్రాంతంలో సర్వే చేపట్టారు. 500 ఇళ్లలో సర్వే చేసి అక్కడ ప్రాంతవాసులకు పరీక్షలు జరిపారు.

మరోవైపు ఈ కరోనా వైరస్‌ బాధితుడు ఢిల్లీలో దిగిన తర్వాత హైదరాబాద్ కు ఆ తరువాత బెజవాడకు ఎలా వచ్చాడు? అని విచారణ చేయగా…. హైదరాబాద్‌ నుంచి బెజవాడకు క్యాబ్‌లో వచ్చాడని తేలింది. దీంతో అతను ఏ క్యాబ్‌లో వచ్చాడో గుర్తించారు అధికారులు. ఆ క్యాబ్‌లో తిరిగి హైదరాబాద్‌కు ముగ్గురు వెళ్లినట్లు తేలడంతో ఎవరెవరు వెళ్లారు? అనే వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు.

ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబసభ్యులను కాక ఎవరెవరిని కలిశాడు? అని పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. బాధితుడు నివాసం ఉన్న ప్రాంతంలో… మూడు నుంచి ఐదు కిలోమీటర్ల ప్రాంతాన్ని పూర్తిగా జల్లెడపడుతున్నారు. ఐసోలేషన్‌ ప్రక్రియను అధికారులు చేపట్టారు. ప్రజలు సహకరించాలని కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ కోరారు.

First Published:  22 March 2020 2:10 AM GMT
Next Story