31 వరకు రైళ్లు బంద్.... రైల్వే శాఖ సంచలన నిర్ణయం
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకూ 341 కేసులు దాటాయి. ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే విదేశీ విమానాల రాకపోకలను కేంద్రం నిషేధించింది. దేశీయ విమానాల రాకపోకలు తగ్గించింది. ఈ నేపథ్యంలో రైళ్లను కూడా మార్చి 31 వరకు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. రైళ్లలో ప్రయాణించిన వారిలో 12 మందికి పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇప్పటికే జార్ఖండ్ మార్చి 31 వరకు తమ రాష్ట్రానికి వచ్చే రైళ్లను ఆపివేయాలని […]
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకూ 341 కేసులు దాటాయి. ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే విదేశీ విమానాల రాకపోకలను కేంద్రం నిషేధించింది. దేశీయ విమానాల రాకపోకలు తగ్గించింది. ఈ నేపథ్యంలో రైళ్లను కూడా మార్చి 31 వరకు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.
రైళ్లలో ప్రయాణించిన వారిలో 12 మందికి పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇప్పటికే జార్ఖండ్ మార్చి 31 వరకు తమ రాష్ట్రానికి వచ్చే రైళ్లను ఆపివేయాలని కోరింది. దీంతో రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకు ప్యాసింజర్ రైళ్లను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
విమానాల రద్దుతో కరోనా పాజిటివ్ కేసులు ఉన్నవారు, విదేశాల నుంచి వచ్చిన వారు రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీతో పాటు కాజీపేట, సికింద్రాబాద్‌లో ఐసోలేషన్‌లో ఉండాల్సిన వారు రైళ్లలో ప్రయాణిస్తూ అధికారులకు పట్టుబడ్డారు. దీంతో కరోనా వ్యాప్తి చెందకుండా రైళ్లను ఆపివేయాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే పలు రాష్ట్రాలు మార్చి 31 వరకు పలు సంస్థలు, విద్యాసంస్థలు, థియేటర్లు, ఫంక్షన్ హాళ్లు మూసివేయాలని ఆదేశించింది. గుజరాత్‌లో అహ్మదాబాద్, సూరత్, రాజ్‌కోట్, వడోదర నగరాల్లో పూర్తిగా బుధవారం వరకు అన్ని వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నగరాల్లో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టవద్దని సూచించింది.