Telugu Global
National

బెడిసికొట్టిన చంద్రబాబు వ్యూహం.... ఆగని ఆర్థిక సంఘం నిధులు

చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. లేకపోతే మరోలా ప్రవర్తించడం కొత్తేమీకాదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా దుబార ఖర్చుతో ఏపీ అభివృద్ధి కుంటుపడేలా చేశాడు. దీంతో టీడీపీని కిందటి ఎన్నికల్లో ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించినా ఆయన తీరులో మార్పురాకపోవడం శోచనీయంగా మారింది. తనను ఓడించిన ఏపీ ప్రజలపై కక్ష తీర్చుకునేందుకే బాబు సన్నహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీకి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులు రాకుండా ప్లాన్ చేశారు. దీంట్లో బాబు సక్సస్ అయినప్పటికీ […]

బెడిసికొట్టిన చంద్రబాబు వ్యూహం.... ఆగని ఆర్థిక సంఘం నిధులు
X

చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. లేకపోతే మరోలా ప్రవర్తించడం కొత్తేమీకాదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా దుబార ఖర్చుతో ఏపీ అభివృద్ధి కుంటుపడేలా చేశాడు.

దీంతో టీడీపీని కిందటి ఎన్నికల్లో ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించినా ఆయన తీరులో మార్పురాకపోవడం శోచనీయంగా మారింది. తనను ఓడించిన ఏపీ ప్రజలపై కక్ష తీర్చుకునేందుకే బాబు సన్నహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీకి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులు రాకుండా ప్లాన్ చేశారు. దీంట్లో బాబు సక్సస్ అయినప్పటికీ ఫలితం మాత్రం రాలేదు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో బాబు ప్లాన్ బెడిసికొట్టింది.

2018లోనే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిర్వహించాల్సి ఉండగా చంద్ర‌బాబు ఓట‌మి భ‌యంతో వాయిదా వేస్తూ వ‌చ్చాడు. జ‌గ‌న్ అధికారంలోకి వచ్చాక వీటిపై దృష్టిసారించారు. ఈసారి ఎన్నికలు జరిగితే టీడీపీ ఘోరంగా ఓడిపోతుందని గ్రహించిన బాబు ఎన్నికలను అడ్డుకునేందుకు కుట్రలకు తెరలేపారు.

అలాగే మార్చి నెలఖారులోపు ఎన్నికలు నిర్వహించకుంటే 14వ ఆర్థిక సంఘం నిధులు వెనక్కి మళ్లే అవకాశం ఉంది. దాదాపు 5వేల కోట్లు 14వ ఆర్థిక సంఘం నిధులు ఏపీకి రాకుండా చేస్తే ఏపీ అభివృద్ధి కుంటుపడటంతోపాటు జ‌గ‌న్ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని చంద్రబాబు భావించాడు. అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలను సిద్ధం చేసుకొని స్థానిక ఎన్నికలను మధ్యలోనే వాయిదా వేయించగలిగాడు.

ఈ వ్య‌వ‌హారం ఏపీలో తీవ్ర దుమారం రేపింది. దీంతో 14వ ఆర్థిక సంఘం నిధులు విడుద‌ల చేయాల‌ని ఇటీవ‌ల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ను ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి క‌లిసి విన్న‌వించారు.

దీనిపై స్పందించిన కేంద్రమంత్రి ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించని కారణంగా నిలిపివేసిన ఆర్థిక సంఘం నిధుల్లో పెండింగ్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌ను విడుదల చేస్తున్నట్లు తాజాగా ట్విట‌్టర్లో పేర్కొన్నారు. దీంతో ఏపీకి బకాయి ఉన్న నిధుల్లో 1,301.23 కోట్లను కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసింది.

అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు 2018-19 ఆర్థిక సంవత్సరంలో అందాల్సిన రూ.870.23 కోట్లు…. పట్టణ స్థానిక సంస్థలకు 2019-20 సంవత్సరపు తొలి విడతగా విడుదల కావాల్సిన రూ.431 కోట్లను ఇచ్చేసింది.

ఏపీతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించని అరుణాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ, ఒడిసా, తమిళనాడు రాష్ట్రాలకూ ఆయా ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన నిధులు రూ.5,140 కోట్లను కేంద్రం మంజూరు చేసింది.

చంద్రబాబు ఎన్నికల వాయిదా వ్యూహం ఫలించినప్పటికీ… తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం బాబుకు షాకిచ్చింది. దీంతో టీడీపీ నాయకులు స్థానిక సంస్థలు వాయిదా వేయించినప్పటికీ ఫలితం దక్కలేదనే నిరాశలో మునిగిపోయారు.

First Published:  22 March 2020 10:54 AM IST
Next Story