Telugu Global
National

నాకు చప్పట్లు వద్దు... ఇవి ఇవ్వండి చాలు " ఒక డాక్టర్ లేఖ

కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా కరోనా వ్యాదిగ్రస్తుల కోసం అహర్నిషలు పాటుపడుతున్న డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది కోసం సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టి కృతజ్ఞత తెలియజేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. కాగా, డాక్టర్లకు చప్పట్లు కొట్టడంపై మనీషా బంగర్ అనే డాక్టర్ తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. మోడీ-బీజేపీ ప్రతిపాదించిన ఈ చప్పట్ల […]

నాకు చప్పట్లు వద్దు... ఇవి ఇవ్వండి చాలు  ఒక డాక్టర్ లేఖ
X

కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా కరోనా వ్యాదిగ్రస్తుల కోసం అహర్నిషలు పాటుపడుతున్న డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది కోసం సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టి కృతజ్ఞత తెలియజేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

కాగా, డాక్టర్లకు చప్పట్లు కొట్టడంపై మనీషా బంగర్ అనే డాక్టర్ తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. మోడీ-బీజేపీ ప్రతిపాదించిన ఈ చప్పట్ల కాన్సెప్టును ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నా కోసం దయచేసి ఎవరూ చప్పట్లు కొట్టొద్దని.. అవసరమైనే ఈ సమస్యలు తీర్చండని ఫేస్‌బుక్ సాక్షిగా ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ఏం రాశారో చూద్దాం..

ప్రియమైన భారతీయులారా….

మోడీ-బీజేపీల ‘ఘంటాలజీ జ్ఞానం’ మాకేమీ వద్దు. దయచేసి నాకోసం చప్పట్లు కొట్టవద్దు. నేను ఒక డాక్టర్‌నే కాని నాకోసం ఎవరూ చప్పట్లు మాత్రం కొట్టొద్ది. అంటువ్యాదుల బారిన పడిన రోగులకు నేను గత రెండు దశాబ్దాలుగా చికిత్స చేస్తున్నాను. ఇప్పుడు కరోనా మహమ్మరి తీవ్రమైన నేపథ్యంలో కూడా రోగులకు చికిత్స అందిస్తున్నాను. కానీ నాకు చప్పట్ల కంటే ముఖ్యమైన సమస్యలు తీరిస్తే బాగుంటుంది.

ఒక నిజమైన భారతీయ పౌరుడిగా ఉన్న ప్రాథమిక హక్కుల్లో భాగంగా నేను కింద పేర్కొన్న వాటిని మోడీ, బీజేపీ ప్రభుత్వం నుంచి డిమాండ్ చేయాలని నేను కోరుకుంటున్నాను.

  • విపత్తు నివారణ నిధులు ఎన్ని సమకూర్చారు, ఇలాంటి సమయంలో ప్రభుత్వ ప్రణాళిక ఏంటో తెలియజేయమనండి.
  • కరోనాపై పోరాటానికి నిధులను మంజూరు చెయ్యమనండి. సర్థార్ పటేల్ విగ్రహం కోసం ఎంత వెచ్చించారో దానికి రెట్టింపు నిధులు ఇవ్వమని అడగండి.
  • అప్పులు ఎగ్గొట్టిన కార్పొరేట్లకు, పారిశ్రామిక వేత్తలకు ఎలాగైతే మన డబ్బులు వెచ్చించి విడిపించారో.. ఇప్పుడు ఆ వ్యాపారవేత్తల నుంచి తిరిగి సొమ్ము రాబట్టండి. దానిని ప్రస్తుత విపత్తు నుంచి రక్షించడానికి ఉపయోగించండి.
  • దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవాలయాల ఖజానాల్లో మూలుగుతున్న వెండి, బంగారం, డబ్బును ప్రభుత్వ సొమ్ముగా ప్రకటించి.. దానిని కరోనాపై పోరాటానికి వాడండి.

కనీసం నేను పైన ఉదహరించిన కొన్నింటిని అమలు చేయండి. అంతే కాని చప్పట్లు వంటివి కొట్టొద్దు అని ఆమె చెప్పారు. డాక్టర్ మనీషా బంగార్ హైదరాబాద్‌లో గ్యాస్ట్రోఎంటరాలజీ సీనియర్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు.

First Published:  22 March 2020 10:28 AM IST
Next Story