Telugu Global
NEWS

కరోనా ఎఫెక్ట్ : ఉచితంగా తిరుపతి లడ్డూలు

కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చుతుండటంతో దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ మూతబడ్డాయి. భక్తులను దర్శనాలకు రానివ్వడం లేదు. ఈ క్రమంలోనే తిరుమల దర్శనాల కూడా నిలిపివేశారు. భక్తులు ఎవరూ కరోనా భయంతో శ్రీవారి దర్శనానికి రావట్లేదు. దీంతో తిరుమల పూర్తిగా బోసిపోయింది. అయితే శ్రీవారి భక్తుల కోసం తయారు చేసిన లడ్డూ నిల్వలు పోటులో పేరుకొని పోయాయి. ఇప్పటికే పోటులో కొత్త లడ్డూలు తయారు చేయకపోయినా ముందుగా సిద్దం చేసిన 2 లక్షల లడ్డూలు అలాగే ఉండిపోయాయి. దీంతో […]

కరోనా ఎఫెక్ట్ : ఉచితంగా తిరుపతి లడ్డూలు
X

కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చుతుండటంతో దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ మూతబడ్డాయి. భక్తులను దర్శనాలకు రానివ్వడం లేదు. ఈ క్రమంలోనే తిరుమల దర్శనాల కూడా నిలిపివేశారు.

భక్తులు ఎవరూ కరోనా భయంతో శ్రీవారి దర్శనానికి రావట్లేదు. దీంతో తిరుమల పూర్తిగా బోసిపోయింది. అయితే శ్రీవారి భక్తుల కోసం తయారు చేసిన లడ్డూ నిల్వలు పోటులో పేరుకొని పోయాయి. ఇప్పటికే పోటులో కొత్త లడ్డూలు తయారు చేయకపోయినా ముందుగా సిద్దం చేసిన 2 లక్షల లడ్డూలు అలాగే ఉండిపోయాయి.

దీంతో ఈ లడ్డూలను ఉగాది రోజు ఉచితంగా ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. కొండపైకి భక్తులకు అనుమతి లేనందున.. టీటీడీ సిబ్బందికి ఈ లడ్డూలను ఉచితంగా ఇవ్వనున్నారు.

First Published:  21 March 2020 5:48 AM IST
Next Story