Telugu Global
NEWS

కరోనా పై యుద్ధం ప్రకటించిన టెన్నిస్ భామలు

రుమేనియా టెన్నిస్ క్వీన్ పెద్దమనసు కరోనా కట్టడికి భారీగా సాయం దేశానికి, మానవాళికి కష్టం ఎదురైనప్పుడు అండగా నిలవడం, తనవంతుగా సాయం చేయడం చాంపియన్ క్రీడాకారుల లక్షణం. దానికి తాను ఏమాత్రం మినహాయింపు కాదని రుమేనియా టెన్నిస్ క్వీన్, వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ మాజీచాంపియన్ సిమోనా హాలెప్ చాటుకొంది. ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా వైరస్ …యూరోపియన్ దేశం రుమేనియాను సైతం తాకింది. ఇప్పటికే 200 కరోనా పాజిటివ్ కేసులు రుమేనియా వ్యాప్తంగా నమోదయ్యాయి. దీంతో ఆర్థికసమస్యలు, నిధుల […]

కరోనా పై యుద్ధం ప్రకటించిన టెన్నిస్ భామలు
X
  • రుమేనియా టెన్నిస్ క్వీన్ పెద్దమనసు
  • కరోనా కట్టడికి భారీగా సాయం

దేశానికి, మానవాళికి కష్టం ఎదురైనప్పుడు అండగా నిలవడం, తనవంతుగా సాయం చేయడం చాంపియన్ క్రీడాకారుల లక్షణం. దానికి తాను ఏమాత్రం మినహాయింపు కాదని రుమేనియా టెన్నిస్ క్వీన్, వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ మాజీచాంపియన్ సిమోనా హాలెప్ చాటుకొంది.

ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా వైరస్ …యూరోపియన్ దేశం రుమేనియాను సైతం తాకింది. ఇప్పటికే 200 కరోనా పాజిటివ్ కేసులు రుమేనియా వ్యాప్తంగా నమోదయ్యాయి.

దీంతో ఆర్థికసమస్యలు, నిధుల కొరతతో అల్లాడుతున్న రుమేనియా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికను చర్యలు ప్రారంభించింది.

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోడానికి పోరాటం మొదలు పెట్టింది. తమ ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో తాను సైతం పాలుపంచుకోవాలని రుమేనియన్ టెన్నిస్ గ్రేట్, ప్రపంచ టాప్ టెన్ ర్యాంకర్ సిమోనా హాలెప్ నిర్ణయించింది.

టెన్నిస్ విజయాల ద్వారా తాను సంపాదించిన వందల కోట్ల రూపాయల నుంచి కొంత మొత్తాన్ని కరోనావైరస్ తో పోరాటానికి తనవంతుగా వెచ్చించాలని నిర్ణయించింది.

వైద్యసిబ్బందికి హ్యాట్సాఫ్…

కరోనా వైరస్ నివారణకు తమ ప్రాణాలనే పణంగా పెట్టి పోరాడుతున్న వైద్యసిబ్బందికి తోడుగా నిలవాలని తాను నిర్ణయించానని, వైద్యపరికరాలు, చికిత్సకు కావాల్సిన మందులు కొనటానికి తనవంతుగా నిధులు అందచేసినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

ప్రభుత్వం, వైద్యసిబ్బంది చేస్తున్న ఈ పోరాటం ప్రజల ఆరోగ్యం కోసమని, ప్రజలు సైతం తమవంతుగా ప్రభుత్వానికి నిధులు అందచేయాలని పిలుపునిచ్చింది.

ప్రపంచ మహిళా టెన్నిస్ లో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ లాంటి గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన తొలి రుమేనియా మహిళగా సిమోనా హాలెప్ కు గుర్తింపు ఉంది.

బియాంకా, కేట్ మెక్ నాలీ సైతం…

కెనేడియన్ టెన్నిస్ క్వీన్ బియాంకా, కాథరిన్ మెక్ నాలీ లాంటి టెన్నిస్ ప్లేయర్లు…కరోనా వైరస్ తో పోరుకు అండగా నిలవాలని నిర్ణయించారు. తమవంతుగా నిధులు అందచేయడంతో పాటు… తమ ఆటోగ్రాఫ్ లతో కూడిన టెన్నిస్ ర్యాకెట్ లను వేలం కోసం చందాకు ఇచ్చారు. కరోనా వైరస్ బారిన పడిన క్రీడాకారుల చికిత్సకు తాము అందచేసిన నిధులను వాడాలని వారు కోరారు.

First Published:  21 March 2020 2:34 AM IST
Next Story