Telugu Global
National

రవిప్రకాష్ ఇంట్లో సోదాలు.... కారణం ఇదే !

టీవీ9 సీఈవోగా ఉన్నప్పుడు రవిప్రకాశ్ చేసిన దందాలు, మోసాలపై ఇప్పటికీ బాధితులు కథలు కథలుగా చెబుతూనే ఉంటారు. టీవీ9 లాంటి అతిపెద్ద మీడియా సామ్రాజ్యాన్ని అడ్డుపెట్టుకొని రవిప్రకాష్ ఆడిన ఆటలకు చెక్ పడింది. కొద్దిరోజుల క్రితమే ఆయనను తొలగించి బయటకు పంపారు. మోసం, మనీ లాండరింగ్ లాంటి కేసులను ఎదుర్కొంటున్నాడు రవిప్రకాష్. అయితే కేంద్రంలోని బీజేపీ సహా జాతీయ పార్టీలతో కలిసి మరో చానెల్ ను లాంచ్ చేసే పనిలో ఉన్న రవిప్రకాశ్ తన ప్రత్యర్థులను మరోసారి […]

రవిప్రకాష్ ఇంట్లో సోదాలు.... కారణం ఇదే !
X

టీవీ9 సీఈవోగా ఉన్నప్పుడు రవిప్రకాశ్ చేసిన దందాలు, మోసాలపై ఇప్పటికీ బాధితులు కథలు కథలుగా చెబుతూనే ఉంటారు. టీవీ9 లాంటి అతిపెద్ద మీడియా సామ్రాజ్యాన్ని అడ్డుపెట్టుకొని రవిప్రకాష్ ఆడిన ఆటలకు చెక్ పడింది. కొద్దిరోజుల క్రితమే ఆయనను తొలగించి బయటకు పంపారు. మోసం, మనీ లాండరింగ్ లాంటి కేసులను ఎదుర్కొంటున్నాడు రవిప్రకాష్.

అయితే కేంద్రంలోని బీజేపీ సహా జాతీయ పార్టీలతో కలిసి మరో చానెల్ ను లాంచ్ చేసే పనిలో ఉన్న రవిప్రకాశ్ తన ప్రత్యర్థులను మరోసారి ఇరుకున పెట్టాలని చూస్తున్నట్టు తెలిసింది.

తాజాగా టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ఇంట్లో సీసీఎస్ పోలీసుల సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని బీఎన్ రెడ్డి కాలనీలో రవిప్రకాశ్ ఇంట్లో ముసద్దీలాల్ జువ్వెల్లరీస్ అధినేత సుకేష్ గుప్తా తలదాచుకున్నట్టు అధికారులకు సమాచారం అందింది.

దీంతో రవిప్రకాష్ ఇంట్లో సోదాలు జరిగాయి. సుకేష్ గుప్తాపై రూ.110 కోట్ల రుణం తీసుకొని వడ్డీ, వాయిదాలు చెల్లించకుండా పారిపోయి రవిప్రకాష్ ఇంట్లో తలదాచుకోవడంతో… పోలీసులు పక్కా సమాచారంతో రవిప్రకాష్ ఇంటిపై దాడి చేసి అతడిని పట్టుకున్నారు. దీంతో ఈ కేసులోనూ రవిప్రకాష్ బుక్ అయినట్లు అయింది.

First Published:  21 March 2020 11:23 AM IST
Next Story