Telugu Global
Others

హిందుత్వకు ఉదారవాద ముసుగు

మతతత్వానికి, ప్రాంతీయతావాద సిద్ధాంతాలకు మేధో పరంగానూ, నైతికంగానూ ఉదారవాద దృక్పథంతో సంబంధం ఎలా పొసగుతుందో అన్నది ఎప్పుడూ అంతుపట్టని సమస్యే. ఇలాంటి దృక్పథం జ్ఞానాన్వేషణా క్రమంలోనూ, నైతికంగానూ పొసగే వ్యవహారం కాదు. మతతత్వ దృక్పథం జ్ఞానాన్వేషణకు, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి పనికి రాదు. మతతత్వం తలకెక్కిన వారికి తార్కికమైన జ్ఞానాన్వేషణలో శ్రద్ధ ఉండదు. సమాజానికి వారు దిశా నిర్దేశం కూడా చేయలేరు. ఇలాంటివారికి కులం వంటి సామాజిక వాస్తవికతను అర్థం చేసుకునే లక్షణమూ ఉండదు. సామాజిక పరిస్థితిని […]

హిందుత్వకు ఉదారవాద ముసుగు
X

మతతత్వానికి, ప్రాంతీయతావాద సిద్ధాంతాలకు మేధో పరంగానూ, నైతికంగానూ ఉదారవాద దృక్పథంతో సంబంధం ఎలా పొసగుతుందో అన్నది ఎప్పుడూ అంతుపట్టని సమస్యే. ఇలాంటి దృక్పథం జ్ఞానాన్వేషణా క్రమంలోనూ, నైతికంగానూ పొసగే వ్యవహారం కాదు. మతతత్వ దృక్పథం జ్ఞానాన్వేషణకు, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి పనికి రాదు. మతతత్వం తలకెక్కిన వారికి తార్కికమైన జ్ఞానాన్వేషణలో శ్రద్ధ ఉండదు. సమాజానికి వారు దిశా నిర్దేశం కూడా చేయలేరు. ఇలాంటివారికి కులం వంటి సామాజిక వాస్తవికతను అర్థం చేసుకునే లక్షణమూ ఉండదు. సామాజిక పరిస్థితిని వీరు అర్థం చేసుకోరు. వీరికి సమాజంలో సమానత్వం సాధించాలన్న ధ్యాస కూడా ఉండదు. కుల వివక్ష వీరికి అర్థం కాదు. ఇలాంటి నేపథ్యంలోనే మతతత్వ వైఖరికి, ఉదారవాద ఆదర్శాలకు మధ్య లంకె ఎలా కుదుర్తుందో పరిశీలించడం ఆసక్తికరంగా ఉంటుంది.

అడగవలసిన ప్రశ్న ఏమిటంటే మతతత్వ, ప్రాంతీయ దృక్పథం శాశ్వతంగా ఉదారవాద ఆదర్శాలను ద్వేషిస్తూనే ఉంటుందా? 2013 డిసెంబర్ 14 నాటి ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సంచికలో “సెక్యులర్ తత్వం భాషలు” అన్న వ్యాసంలో సుదీప్త కవిరాజ్ చర్చించారు. భారత రాజకీయాల్లో వామపక్ష, హిందూ జాతీయతావాద క్రమంగా ఉదారవాద ఆదర్శాల మీద ద్వేషం తగ్గించుకున్నాయి అని కవి రాజ్ వాదించారు. వాటిని యథాలాపంగా ఉపయోగిస్తున్నాయని ఆయన అంటారు.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలోంచి చూస్తే భారత్ లోని వామపక్షాలు రాజ్యాంగంలో పొందుపరచిన ఉదారవాద ఆదర్శాలను సమర్థిస్తున్నాయి. ఇది వామపక్షాల విప్లవ వ్యూహంలో భాగమై ఉండవచ్చు. ఎందుకంటే వామపక్షాలు ఒక అడుగు ముందుకు వేయడం కోసం రెండడుగులు వెనక్కు వేయడానికి సిద్ధంగా ఉంటాయి.

కవిరాజ్ ఈ వ్యాసంలో లేవనెత్తిన ఒక అంశం ఆసక్తికరమైంది. “సర్వ వ్యాప్తమైన ఈ విశ్వంతరాళంలో హిందూ జాతీయతావాదం తన స్థానాన్ని తాను మళ్లీ పదిలం చేసుకుంటోంది. దానికి కులం, మతపరమైన సంఘీభావం లాంటి ఆకట్టుకునే భావాలకు తగిన సరంజామా కావాలి. ఈ రెండు అంశాలూ విచిత్రంగా వివక్షకు వ్యతిరేకమైనవిగానే కనిపిస్తాయి. తమ పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని వాదించడానికి హిందూ జాతీయతావాదులు ద్విముఖ వ్యూహం అనుసరిస్తున్నారు. మొదటిది ముస్లింల నుంచి ఉన్న ‘ముప్పు’ను ప్రస్తావించడం విచిత్రంగా ఉంది.”

నిజానికి ముస్లింలలో అత్యధిక సంఖ్యాకులు విద్యాపరంగానూ, ఆర్థిక పరంగానూ వెనుకబడి ఉన్నారు. రెండవది హిందూ జాతీయ వాదులు తాము వివక్షకు గురవుతున్నామని అంటున్నారు. ఈ వివక్ష అట్టడుగు వర్గాల వారి విషయంలో చూపే వివక్షలా ఉందంటున్నారు. పైగా ఇది దళితుల పట్ల చూపే వివక్షలా ఉందని వాదిస్తున్నారు. మరి దళితుల పట్ల వివక్ష ఉంటే హిందూ జాతీయతావాదుల విషయంలో వివక్షను అంగీకరించాల్సి వస్తుంది. అంటే తమ ఉదారవాద పథకాన్ని అమలు చేయడానికి, ఉదారవాద భావాల చుట్టూ అధికారం కేంద్రీకృతం చేసుకోవడానికి ఇలాంటి వాదనలు లేవనెత్తుతారు.

తామూ దళితులలాగే వివక్షకు గురవుతున్నామని చెప్పడానికి ముస్లిం పాలకులు తమ విషయంలో వివక్ష పాటించారంటున్నారు. కవిరాజ్ వాదనల దృష్టితో మనం హిందూ జాతీయవతావాద గుట్టు విప్పాల్సి ఉంటుంది. చారిత్రకంగా జరిగిన అన్యాయం ఏమిటో పరిశీలించాలి. చారిత్రక అన్యాయం అన్న విషయాన్నే మనం చారిత్రక దృష్టితో చూడాలి.

నిజానికి శూద్రులు (ప్రస్తుత ఇతర వెనుకబడిన వర్గాల) మీద వివక్ష చూపింది ముస్లింలు కాదు అగ్రవర్ణ హిందువులే. వారే అతి శూద్రుల (దళితుల) మీద విపరీతమైన వివక్ష ప్రదర్శించారు. చారిత్రక అన్యాయాల గురించిన సకల అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. అయితే భారత రాజ్య వ్యవస్థ అనుసరించిన అనేక విధానాలు దళితులకు జరిగిన అన్యాయాన్ని వమ్ము చేయగలిగాయా? అంటే తాము వివక్షకు గురయ్యామన్న హిందూ జాతీయతావాదుల వాదన వాస్తవాలను వక్రీకరించేదిగానే ఉంది. నిజానికి ప్రస్తుతం హిందూ జాతీయతావాదులకు ఉదారవాద ఆదర్శాలతో పనే లేదు.

నిజానికి హిందూ జాతీయతా వాదులకు ఉదారవాద భావనలపై ఏహ్య భావమే ఉంది. అందుకే వారు ఉదారవాద విధానాలను ఆయుధంగా మార్చుకున్నారు. తద్వారా ప్రజాస్వామ్య వాణికి నొక్కేస్తున్నారు. అంటే హిందుత్వానికి ఉదారవాద విధానాలు కనీసం ఒక ఉపకరణంగా కూడా పరిగణనలోకి రావడం లేదు.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

First Published:  20 March 2020 9:06 PM GMT
Next Story