వారం రోజులైంది.... కేఈ ప్రభాకర్ దారెటు ?
కర్నూలు జిల్లాకు చెందిన మాజీమంత్రి కేఈ ప్రభాకర్ దారెటు? చంద్రబాబుకు బైబై చెప్పి వారం రోజులైంది. కానీ ఆయన మాత్రం ఇంకా ఏపార్టీలో చేరేది క్లారిటీ ఇవ్వలేదు. ఒకవైపు టీడీపీ నేతలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారట. పార్టీలో ఉండమని కోరుతున్నారట. ఇలాంటి సమయంలో ఆయన తుది నిర్ణయం ఏం ప్రకటిస్తారని ఆసక్తికరంగా మారింది. స్థానిక సంస్థల టైమ్ చూసుకుని కేఈ ప్రభాకర్ టీడీపీకి ఝలక్ ఇచ్చారు. పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని బాంబు పేల్చారు. కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి […]
కర్నూలు జిల్లాకు చెందిన మాజీమంత్రి కేఈ ప్రభాకర్ దారెటు? చంద్రబాబుకు బైబై చెప్పి వారం రోజులైంది. కానీ ఆయన మాత్రం ఇంకా ఏపార్టీలో చేరేది క్లారిటీ ఇవ్వలేదు.
ఒకవైపు టీడీపీ నేతలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారట. పార్టీలో ఉండమని కోరుతున్నారట. ఇలాంటి సమయంలో ఆయన తుది నిర్ణయం ఏం ప్రకటిస్తారని ఆసక్తికరంగా మారింది.
స్థానిక సంస్థల టైమ్ చూసుకుని కేఈ ప్రభాకర్ టీడీపీకి ఝలక్ ఇచ్చారు. పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని బాంబు పేల్చారు. కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు.
ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ ఇతరులు కేఈ కృష్ణమూర్తితో సంప్రదింపులు జరుపుతున్నారట. పార్టీలో ఎలాంటి ఇబ్బంది ఉండదని తిరిగి కొనసాగాలని సూచించారట. అదే విధంగా బీజేపీ ముఖ్య నేతలు కూడా ప్రభాకర్‌తో టచ్‌లోకి వచ్చారట. తమ పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారట.
ఎమ్మెల్సీగా ఎన్నికైన సమయంలో టీడీపీ నేతలే కాదు. వైసీపీ అధినేత జగన్ కూడా తనకు సహకరించారని ఇటీవల కేఈ ప్రభాకర్ అన్నారట. దీంతో ఆయన చూపు వైసీపీ వైపు పడిందని ప్రచారం జరిగింది. అయితే వారం రోజులైనా ఆయన పార్టీ మారకపోవడంతో కేఈ ఏ నిర్ణయం తీసుకుంటారనేది జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ మార్పుపై ఒకటి రెండు రోజుల్లో పూర్తి క్లారిటీ ఇస్తానని కేఈ అనుచరులకు చెప్పారట. కుటుంబసభ్యులతో చర్చించిన తర్వాత ఆయన ఏదో ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.