Telugu Global
NEWS

ఈసీ రాసిన లేఖపై అనుమానాలు

తానే రాశానని ధృవీకరించని ఎన్నికల కమిషనర్ ఇది చంద్రబాబు కుట్ర అంటున్న వైసీపీ తనకు ఏపీలో ప్రాణ భయం ఉంది.. కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరుతూ సుదీర్ఘమైన లేఖ కేంద్ర హోం శాఖకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ రాశారనే వార్తలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ లేఖపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. ఈ లేఖను తానే రాశానని రమేష్ కుమార్ ఇప్పటికీ చెప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కేవలం ఇది […]

ఈసీ రాసిన లేఖపై అనుమానాలు
X
  • తానే రాశానని ధృవీకరించని ఎన్నికల కమిషనర్
  • ఇది చంద్రబాబు కుట్ర అంటున్న వైసీపీ

తనకు ఏపీలో ప్రాణ భయం ఉంది.. కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరుతూ సుదీర్ఘమైన లేఖ కేంద్ర హోం శాఖకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ రాశారనే వార్తలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ లేఖపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. ఈ లేఖను తానే రాశానని రమేష్ కుమార్ ఇప్పటికీ చెప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కేవలం ఇది రాజకీయ కుట్రేమోనని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ లేఖను టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేయడంతో ఇది ముమ్మాటికీ చంద్రబాబు కుట్రగా ప్రభుత్వం భావిస్తోంది. సుప్రీంకోర్టులో ఎన్నికల కమిషనర్‌ను జడ్జీలు నిలదీయడం.. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికలు ఎలా వాయిదా వేశారని ప్రశ్నించడంతో అవమానంగా భావించిన రమేష్ కుమార్ కావాలనే టీడీపీతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగానే లేఖ రాశారనే వార్తలకు ఆయన స్పందించకపోవడం బలాన్ని చేకూరుస్తోంది.

ఈసీ లేఖపై వైసీపీ మంత్రులు తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. రమేష్ కుమార్ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని శ్రీనివాస్ ఆరోపించారు.

ఈసీ ఆ లేఖపై వెంటనే స్పందించాలని మరో మంత్రి అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్ పేరుతో విడుదలైన లేఖ తప్పుడుది అయితే రమేష్ కుమార్ పోలీసులకు ఎందుకు పిర్యాదు చేయలేదని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు.

First Published:  19 March 2020 4:44 PM IST
Next Story