యూరో 2020కి సోకిన కరోనా వైరస్
యూరో హంగామా ఏడాది వాయిదా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీని తలదన్నే రీతిలో…యూరోప్ లోని ఎనిమిది దేశాలు వేదికగా…24 జట్ల మధ్య జరగాల్సిన 2020 యూరోపియన్ ఫుట్ బాల్ చాంపియన్షిప్ ను…కరోనా వైరస్ ముప్పు కారణంగా ఏడాదిపాటు వాయిదా వేస్తున్నట్లు నిర్వాహక సంఘం ప్రకటించింది. జూన్ నుంచి జులై వరకూ జరగాల్సిన ఈ సాకర్ సంబరాన్ని వాయిదా వేయక తప్పడం లేదని…55 సభ్యదేశాలతో సంప్రదించిన తర్వాత యూరోపియన్ ఫుట్ బాల్ సంఘం ప్రకటించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 7వేలమందిని పొట్టనపెట్టుకొన్న […]
- యూరో హంగామా ఏడాది వాయిదా
ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీని తలదన్నే రీతిలో…యూరోప్ లోని ఎనిమిది దేశాలు వేదికగా…24 జట్ల మధ్య జరగాల్సిన 2020 యూరోపియన్ ఫుట్ బాల్ చాంపియన్షిప్ ను…కరోనా వైరస్ ముప్పు కారణంగా ఏడాదిపాటు వాయిదా వేస్తున్నట్లు నిర్వాహక సంఘం ప్రకటించింది.
జూన్ నుంచి జులై వరకూ జరగాల్సిన ఈ సాకర్ సంబరాన్ని వాయిదా వేయక తప్పడం లేదని…55 సభ్యదేశాలతో సంప్రదించిన తర్వాత యూరోపియన్ ఫుట్ బాల్ సంఘం ప్రకటించింది.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 7వేలమందిని పొట్టనపెట్టుకొన్న కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన దేశాలన్నీ తమతమ క్రీడాకార్యకలాపాలను రద్దు చేయడమే లేదా వాయిదా వేయటమే చేస్తున్నాయి.
యూరోప్ దేశాలలో విపరీతమైన ఆదరణతో పాటు నంబర్ వన్ గేమ్ గా ఉన్న ఫుట్ బాల్ ను… ఓ సంబరంలా నిర్వహించుకోడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో యుద్ధాలకారణంగా ఒకటి రెండుసార్లు వాయిదా పడిన యూరోసాకర్…తొలిసారిగా కరోనా వైరస్ కారణంగా ఏడాదికాలంపాటు వాయిదా పడకతప్పలేదు.
యూరోసాకర్ నెలరోజుల హంగామా నిర్వహించడం ద్వారా..ఆతిథ్యదేశాల ఆర్థికవ్యవస్థలలోకి లక్షల కోట్ల యూరోల ఆదాయం ప్రవహించనుంది. ఫుట్ బాల్ కంటే తమకు ప్రజల ప్రాణాలే ముఖ్యమని, ముందుజాగ్రత్త చర్యగా ఏడాదికాలంపాటు వాయిదా వేసుకోక తప్పలేదని అధికారికంగా ప్రకటించింది.
కరోనా వైరస్ ముప్పు పూర్తిగా తొలగిన అనంతరం యూరో 2020 టోర్నీని ఘనంగా నిర్వహిస్తామని, అప్పటి వరకూ అభిమానులు తమ ఆరోగ్యపట్ల శ్రద్ధ చూపాలని పీఫా విజ్ఞప్తి చేసింది.