కరోనా ఎఫెక్ట్ : విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు. పలు క్రీడా ఈవెంట్లు, సభలు, సమావేశాలు రద్దు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల విద్యాసంస్థలు, బార్లు, మాల్స్, థియేటర్లు ఈ నెల 31 వరకు మూసేయాలని ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాపిస్తుండటంతో అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. రేపటి (మార్చి 19) నుంచి పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, కోచింగ్ సెంటర్లు […]
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు. పలు క్రీడా ఈవెంట్లు, సభలు, సమావేశాలు రద్దు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల విద్యాసంస్థలు, బార్లు, మాల్స్, థియేటర్లు ఈ నెల 31 వరకు మూసేయాలని ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాపిస్తుండటంతో అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. రేపటి (మార్చి 19) నుంచి పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, కోచింగ్ సెంటర్లు మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
ఇక, కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. కరోనా ప్రభావం నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ క్రమంలో విద్యా, వైద్య శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించి పాఠశాలల సెలవుల నిర్ణయం తీసుకున్నారు.