Telugu Global
National

కరోనా భయంతో బీసీసీఐ వర్క్ ఫ్రమ్ హోమ్

అదేదారిలో బెంగాల్ క్రికెట్ సంఘం ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు ప్రధానకార్యాలయం…కరోనా వైరస్ భయంతో తలుపులు మూసుకొంది. ముంబై వాంఖెడీ స్టేడియంలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయం ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోయింది. ఎప్పుడూ వచ్చేవారు, పోయేవారితో కళకళలాడుతూ కనిపించే బీసీసీఐ ఇప్పుడు అసలు ఉందా…లేదా అన్నట్లుగా మారిపోయింది. బీసీసీసీ తన ప్రధాన కార్యాలయానికి తాళాలు వేసి…తన సిబ్బందిని ఇంటినుంచే పని చేయాలంటూ …వర్క్ ప్రమ్ హోమ్ వెసలు బాటు కల్పించింది. బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే […]

కరోనా భయంతో బీసీసీఐ వర్క్ ఫ్రమ్ హోమ్
X
  • అదేదారిలో బెంగాల్ క్రికెట్ సంఘం

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు ప్రధానకార్యాలయం…కరోనా వైరస్ భయంతో తలుపులు మూసుకొంది. ముంబై వాంఖెడీ స్టేడియంలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయం ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోయింది. ఎప్పుడూ వచ్చేవారు, పోయేవారితో కళకళలాడుతూ కనిపించే బీసీసీఐ ఇప్పుడు అసలు ఉందా…లేదా అన్నట్లుగా మారిపోయింది.

బీసీసీసీ తన ప్రధాన కార్యాలయానికి తాళాలు వేసి…తన సిబ్బందిని ఇంటినుంచే పని చేయాలంటూ …వర్క్ ప్రమ్ హోమ్ వెసలు బాటు కల్పించింది. బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షా, ఇతర సిబ్బంది తమతమ స్వస్థాలకు చేరిపోయారు. ఆన్ లైన్ ద్వారానే తమతమ విధులను నిర్వర్తిస్తున్నారు.

ఐపీఎల్ ను ఏప్రిల్ 15 వరకూ వాయిదా వేయటం, సౌతాఫ్రికాతో భారత వన్డే సిరీస్ ను రద్దు చేయటం, క్రికెట్ కార్యకలాపాలనే స్తంభింపచేయడంతో… క్రికెటర్లు సైతం తమతమ నివాసాలకే పరిమితం కావాల్సి వచ్చింది.

మరోవైపు…బీసీసీఐ తర్వాత అతిపెద్ద క్రికెట్ కార్యాలయం…బెంగాల్ క్రికెట్ సంఘం సైతం…తన ఉద్యోగులను ప్రధానకార్యాలయానికి రాకుండా ఇంటిపట్టునే ఉండి తమ విధులను నిర్వర్తించాలని ఆదేశించింది.

కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లోని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ కార్యాలయం తలుపులు ఒక్కసారిగా మూసుకుపోయాయి. కరోనా వైరస్ మహిమ అంటే.. ఇదే అనుకోవాలి మరి.

First Published:  18 March 2020 5:39 AM IST
Next Story